Maharashtra Elections: మంత్రి భార్య రీల్స్ చేస్తుంటే.. మేం మతాన్ని రక్షించుకోవాలా..
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:21 PM
లీడర్లు మతం పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. వాళ్ల పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారని కాంగ్రెస్ లీడర్ మండిపడ్డారు.
పుణె: రాజకీయ నాయకుల పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే ప్రజలు మాత్రమే ఎందుకు మతాన్ని రక్షించుకోవాలో చెప్పాలంటూ కాంగ్రెస్ లీడర్ కన్నయ్య కుమార్ ప్రశ్నించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృత ఫడ్నవిస్ ను ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు. పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. విభజన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దేవేంద్ర ఫడ్నవిస్ పై మండిపడ్డాడు.
ఇది ధర్మ యుద్ధంమే అయితే మీకు ప్రసంగాలు ఇస్తున్న లీడర్లను ఒక మాట అడగండి. ఈ యుద్ధంలో నాయకుల పిల్లలు కూడా పాల్గొంటారా? అని.. వాళ్లేమో విదేశాల్లో చదువుతుంటే మనం మతాన్ని రక్షించుకోవాలా? డిప్యూడీ సీఎం భార్య ఒకరు.. క్లాసికల్ డ్యాన్సర్, బ్యాంకర్ కూడా. ఆమె ఇన్ స్ట్రాగ్రామ్‌లో రీల్స్ తో బిజీగా ఉంటుందా? అని కన్నయ్య కుమార్ ప్రశ్నలు గుప్పించాడు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా పైనా కన్నయ్య కుమార్ విమర్శలు ఎక్కుపెట్టాడు. మరి ఐసీసీ చైర్ పర్స్ గా ఉన్న అమిత్ షా కుమారుడు కూడా ఈ మతాన్ని రక్షించుకునే పోరాటంలో పాల్గొంటాడా? క్రికెట్‌లో డ్రీం 11 జట్టును తయారు చేయాలని వారు చెప్తుంటారు. మనం మాత్రం ఎప్పటికీ జూదగాళ్లలాగానే మిగిలిపోతున్నాం అంటూ మండిపడ్డాడు.