Share News

భారత్‌కు ముయిజ్జు

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:35 AM

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు.

భారత్‌కు ముయిజ్జు

  • ఐదు రోజుల పర్యటన.. నేడు ప్రధానితో సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 6: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు. సుమారు 12 మంది మంత్రులు, సీనియర్‌ అధికారులతో ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న ముయిజ్జును కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ స్వాగతించారు. ఇంతకు ముందు జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముయిజ్జు హాజరయ్యారు. ఈసారి భారత్‌లో ఐదు రోజులు పర్యటించనున్న ముయిజ్జు.. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీతో సమావేశంకానున్నారు.

ముంబై, బెంగళూరులో జరిగే పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ప్రధానిమోదీతో ముయిజ్జు సోమవారం సమావేశంకానున్నారు. గతేడాది నవంబరులో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్‌తో ఆ దేశ సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా మద్దతుదారుగా పేరొందిన ముయిజ్జు.. తమ దేశంలోని భారత సైనికులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా న్యూఢిల్లీ బయలుదేరే ముందు బీబీసీతో మాట్లాడిన ముయిజ్జు.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాల్దీవులకు భారత్‌ అండగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated Date - Oct 07 , 2024 | 03:35 AM