INDIA Bloc: కూటమి సారథిగా మల్లికార్జున్ ఖర్గే..!
ABN , Publish Date - Jan 13 , 2024 | 03:53 PM
తీవ్రమైన చర్చోపచర్చల అనంతరం 'ఇండియా' బ్లాక్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎంపికయ్యారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అత్యున్నత పదవి కోసం పోటీదారుగా ఉన్న నితీష్ కుమార్ శనివారంనాడు జరిగిన కూటమి వర్చువల్ మీట్‌లో కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా ఈ పదవి అప్పగించాలని సూచించినట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: తీవ్రమైన చర్చోపచర్చల అనంతరం 'ఇండియా' బ్లాక్ (I.N.D.IA. bloc) చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఎంపికయ్యారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అత్యున్నత పదవి కోసం పోటీదారుగా ఉన్న బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ శనివారంనాడు జరిగిన కూటమి వర్చువల్ మీట్‌లో కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా ఈ పదవి అప్పగించాలని సూచించినట్టు తెలుస్తోంది.
కాగా, శనివారంనాడు జరిగిన విపక్ష కూటమి వర్చువల్ మీట్‌లో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మినహా విపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే నేత కనిమొళి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో విభేదాలు జాతీయ స్థాయి ఐక్యతకు అవరోధం కారాదని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.