Share News

RG Kar Medical Student: వైద్యురాలి తండ్రి ఆరోపణలు ఖండించిన సీఎం మమత.. ఇదంతా కుట్ర

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:17 PM

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనలో మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కోల్‌కతాలో స్పందించారు. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.

RG Kar Medical Student: వైద్యురాలి తండ్రి ఆరోపణలు ఖండించిన సీఎం మమత.. ఇదంతా కుట్ర
West Bengal Chief Minister Mamata Banerjee

కోల్‌కతా, సెప్టెంబర్ 09: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనలో మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కోల్‌కతాలో స్పందించారు. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఇటువంటి పని తమ ప్రభుత్వం ఎప్పుడు చేయదన్నారు. తమ ప్రభుత్వంపై వెల్లువెత్తిన ఈ ఆరోపణల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అందులో వామపక్ష పార్టీల ప్రమేయం సైతం ఉందని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు


తమ కుమార్తె హత్యాచార ఘటన కేసులో తాము మౌనంగా ఉండేందుకు కోల్‌కతా పోలీసులు తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ గత వారం మృతురాలి తండ్రి ఆరోపించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీపై విధంగా స్పందించారు. చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి తాను నగదు ఇవ్వాలని ప్రయత్నించలేదన్నారు.


అయినా నగదు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేమన్నారు. హత్యాచార ఘటనతో విగత జీవిగా మారిన 32 ఏళ్ల ట్రైయినీ వైద్యురాలు చిరస్థాయిగా నిలిచి ఉండేలా.. ఆమె స్మారకార్థం ఏదైనా చేయాల్సి ఉందని సీఎం మమతా స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మృతురాలి కుటుంబ వైపునే ఉందని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.


మరోవైపు ఈ వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయని గుర్తు చేశారు ఆ సమయంలో కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ పదవికి రాజీనామా చేసేందుకు ఐపీఎస్ అధికారి వినీత్ గోయెల్ సిద్దపడ్డారన్నారు. కానీ మరికొద్ది రోజుల్లో కోల్‌కతా మహానగరంలో దసరా ఉత్సవాలు జరగనున్నాయని.. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలపై అవగాహన ఉన్న వ్యక్తి ఆ పదవి నుంచి వైదొలిగితే ఎలా అని ఆయన్ని ప్రశ్నించానని సీఎం మమతా బెనర్జీ ఈ సందర్బంగా వివరణ ఇచ్చారు.


ఈ హత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు వ్యవహరించిన తీరుపై మృతురాలి తల్లిదండ్రులు తమ ఆకోశ్రం వివిధ సందర్బాల్లో వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రిలో మూడు గంటల పాటు వేచి చూడాల్సి రావడం.. మృతదేహాన్ని తమకు అప్పగించే సమయంలో ఓ సీనియర్ పోలీసు అధికారి నగదు తమకు ఇచ్చారని.. అయితే తాము దానిని తిరస్కరించామని మృతురాలి తండ్రి గత వారం ఆరోపించిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 09 , 2024 | 04:24 PM