నేను వైద్యులను బెదిరించలేదు : మమత
ABN , Publish Date - Aug 30 , 2024 | 03:54 AM
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన అంశంలో తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కోల్‌కతా, ఆగస్టు 29 : జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన అంశంలో తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హత్యాచార ఘటనకు నిరసనగా విధులు బహిష్కరించిన వైద్యులను బెంగాల్ సీఎం బెదిరించారంటూ బీజేపీ చేస్తోన్న ఆరోపణలను మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. తాను వైద్యులను బెదిరించలేదని, రోగుల అవసరాల దృష్ట్యా విధులకు రావాలని కోరానని, ఆందోళన చేస్తున్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని చెప్పానని గురువారం పేర్కొన్నారు. మరోపక్క.. బెంగాల్ తగలబడితే అసోం, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కూడా కాలిపోతాయంటూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన మమత బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు. మమత వ్యాఖ్యలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా తీవ్రంగా ఖండించారు.