Share News

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ అదే నిర్లక్ష్యం.. యోగర్ట్‌లో ఫంగస్

ABN , Publish Date - Mar 06 , 2024 | 06:10 PM

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది.

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ అదే నిర్లక్ష్యం.. యోగర్ట్‌లో ఫంగస్

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది. దీంతో షాక్‌కి గురైన అతగాడు.. ఈ ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. అంతేకాదు.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో తనకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అస్సలు ఊహించలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..


హర్షద్ తోప్కర్ (Harshad Topkar) అనే ప్రయాణికుడు ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు ప్రయాణించాడు. ఈ సందర్భంగా అతడు భోజనం ఆర్డర్ చేయగా.. యోగర్ట్‌లో ‘ఫంగస్’ గుర్తించాడు. దీంతో షాక్‌కి గురైన హర్షద్.. వెంటనే తన ఫోన్‌లో ఫోటోలు తీసి, వాటిని ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ‘‘నేను వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్‌కు ప్రయాణం చేశాను. నాకు వడ్డించిన యోగర్ట్‌లో ఫంగస్‌ని గుర్తించాను. వందేభారత్‌లో ఇలాంటి అనుభవాన్ని నేను అస్సలు ఊహించలేదు’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అలాగే.. తన ట్వీట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను (Railway Minister Ashwini Vaishnaw) ట్యాగ్ చేశాడు.

ఈ విషయం తమ దృష్టికి రావడంతో.. తన ప్రయాణ వివరాలను పంచుకోవాలని తోప్కర్‌ను ‘రైల్ సేవ’ కోరింది. అలాగే.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్‌ను (IRCTC)ను నార్తన్ రైల్వే ట్యాగ్ చేసింది. దీంతో.. IRCTC దీనిపై వెంటనే స్పందించింది. ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కున్నందుకు తోప్కర్‌కు క్షమాపణలు తెలిపింది. ‘‘సార్, మీకు కలిగిన ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ విషయాన్ని ఆన్‌బోర్డ్ సూపర్‌వైజర్‌కి అందించగా.. ఆయన వెంటనే యోగర్ట్‌ను మార్చారు. ఈ సమస్య గురించి తయారుదారీ వద్ద లేవనెత్తాం’’ అని IRCTC తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 06:27 PM