Share News

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

ABN , Publish Date - Dec 10 , 2024 | 08:29 AM

ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కుకీల జాతుల మధ్య గతేడాది మే మాసంలో ఘర్షణ చెలరేగింది. దీంతో దాదాపు 250 మందికి పైగా మరణించారు. అలాగే ఈ హింస కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడమే కాకుండా.. వందలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస బాట పట్టారు.

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

ఇంఫాల్, డిసెంబర్ 10: రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని మణిపూర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సదరు జిల్లాలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ ఉన్నతాధికారి ఎన్. అశోక్ కుమార్ ఇంఫాల్‌లో వెల్లడించారు. దీంతో ఆయా జిల్లాల్లో ఇకపై మొబైల్, ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Karnataka: కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ కన్నుమూత


గత నవంబర్‌లో ఆరుగురు.. ముగ్గురు మహిళలు, మగ్గురు చిన్నారులు ఆకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అయితే వారి మృతదేహాలను జిరి, బరాక్ నదుల వద్ద స్థానికులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆందోళనలు చెలరేగాయి. ఆ క్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతోన్న వేళ.. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అందులోభాగంగా నవంబర్ 16వ తేదీన మొత్తం 9 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తొమ్మిది జిల్లాలు.. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, జిరిబామ్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి‌తోపాటు ఫర్జాల్‌లో ఈ సేవలను నిలిపి వేసింది. అయితే తాత్కాలికంగా నిలిపి వేసిన ఈ సేవలపై గడువును పెంచుకొంటూ ప్రభుత్వం వచ్చింది.


మరోవైపు మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేక పోవడం వల్ల వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి వారు తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నవంబర్ 19వ తేదీన బ్రాడ్ బ్యాండ్ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే వైఫైపై మాత్రం విధించిన నిషేధాన్ని కొనసాగించింది.


ఇక గతేడాది మేలో ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కుకీల జాతుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో దాదాపు 250 మందికి పైగా ప్రజలు మరణించారు. అలాగే ఈ హింస కారణంగా వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. మణిపూర్‌లోని వందలాది మంది ప్రజలు.. దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస బాట పట్టిన సంగతి తెలిసిందే.

For National News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 08:30 AM