Share News

Manoj Jarange: మోటార్ సైకిల్ ఇచ్చారు, పెట్రోలు మరిచారు... 24 నుంచి మళ్లీ ఆందోళనలు

ABN , Publish Date - Feb 21 , 2024 | 05:51 PM

మరాఠా కమ్యూనిటీకి రెండు క్యాటగిరిల కింద రిజర్వేషన్ పొందే ఛాయెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జారంగే పాటిల్ ) అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము డిమాండ్ చేసింది ఒకటయితే, ప్రభుత్వం ఇస్తామన్నది మరొకటి అని ఆయన బుధవారంనాడు చెప్పారు. ఈనెల 24 నుంచి మళ్లీ తాజా ఆందోళనలు మొదలుపెడతామని ప్రకటించారు.

Manoj Jarange: మోటార్ సైకిల్ ఇచ్చారు, పెట్రోలు మరిచారు... 24 నుంచి మళ్లీ ఆందోళనలు

ముంబై: మరాఠా కమ్యూనిటీకి రెండు క్యాటగిరిల కింద రిజర్వేషన్ పొందే ఛాయెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జారంగే పాటిల్ (Manoj Jarange Patil) అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము డిమాండ్ చేసింది ఒకటయితే, ప్రభుత్వం ఇస్తామన్నది మరొకటి అని ఆయన బుధవారంనాడు చెప్పారు. ఈనెల 24 నుంచి మళ్లీ తాజా ఆందోళనలు మొదలుపెడతామని ప్రకటించారు.


విద్య, ఉద్యోగావకాశాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన మరుసటి రోజే జారంగే తాజా ప్రకటన చేశారు. బిల్లు ప్రకారం మరాఠా సబ్‌కాస్ట్‌గా కుంబీలు ఉంటారు. ఓబీసీ క్యాటగిరి కిందకు తీసుకువస్తారు. విద్య, విద్యోగావకాశాల కల్పనకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. దీనిపై మనోజ్ జారంగే తన అభిప్రాయన్ని మరోసారి కుండబద్ధలు కొట్టారు.


''మేము ఏదైతే డిమాండ్ చేశామో అది ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ కారణాలతోనే అసెంబ్లీ ప్రత్యేక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మేము మరాఠాల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడ్డాం. మాకు వాళ్లు (ప్రభుత్వం) మోటారు సైకిలు ఇచ్చారు. కానీ అందులో పెట్రోలు లేదు'' అని జారంగే విమర్శించారు. మరాఠా ప్రజలను కుంబీలుగా ప్రకటించాలని, ఓసీల నుంచి ప్రత్యేక కోటా గ్రాంట్ చేయాలని తాము మొదట్నించీ డిమాండ్ చేస్తున్నామన్నారు. తమ ఒరిజనల్ డిమాండ్‌తోనే తిరిగి ఈనెల 24 నుంచి ఆందోళన ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి ఒంటిగంట వరకూ, తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రోడ్ల దిగ్బంధం చేపడతామని అన్నారు. బోర్డు పరీక్షలు రాజుస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరసనలు ఉంటాయన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. తమ ఒరిజనల్ డిమాండ్‌కు అనుగుణంగా మరాఠా కమ్యూనిటీకి 'కోటా' ఇవ్వకుంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని ఆయన హెచ్చరించారు.

Updated Date - Feb 21 , 2024 | 05:51 PM