Share News

Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:36 PM

అక్టోబర్ 4వ తేదీన.. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మరణించారు. అయితే పోలీసులు మాత్రం 31 మంది వివరాలను మాత్రమే వెల్లడించారు. మిగిలిన వారిలో అగ్రనేతలు ఉన్నారంటూ ఓ ప్రచారం సైతం సాగింది. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు ఎవరు మరణించ లేదని స్పష్టం చేసింది.

Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ

రాయ్‌పూర్,అక్టోబర్ 19: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ భార్య సుజాత అలియాస్ మైనా బాయి అరెస్ట్ కాలేదని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బూటకపు ప్రచారం చేస్తుందంటూ ప్రభుత్వంపై మండిపడింది. కేంద్రంలోని ఫాసిస్ట్ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో సామూహిక హత్యలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ శనివారం ఓ లేఖను విడుదల చేసింది.

Telangana: బావ బామ్మర్దుల తీరు ఈస్టమన్ కలర్ లాగా ఉంది


మావోయిస్ట్ రహిత భారతం అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా డెడ్ లైన్ పెట్టడం పట్ల నిప్పులు చెరిగింది. అమాయక ఆదివాసీలను హత్య చేసి... ఆ శవాలకు గెరిల్లా యూనిఫాం వేస్తున్నారని ఆరోపించింది. ఫాసిస్ట్‌లకు హిట్లర్ గతే పడుతుందని స్పష్టం చేసింది. అంతిమంగా ప్రజలే విఙయం సాధిస్తారని చరిత్ర రుజువు చేస్తుందని మావోయిస్టు పార్టీ వివరించింది. దండ కారణ్యంలో సాగుతున్న కార్పొరేట్ పాశవిక.. ఆపరేషన్ కగార్ తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దక్షిణ సబ్ జోనల్ బ్యూరో కమిటీ నాయకురాలు సమత పేరుతో ఈ లేఖను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది.

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం


దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తుంది. 2026, మార్చి నాటికి భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆ క్రమంలో ఆపరేషన్ కగార్‌కు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు షెల్టర్‌ జోన్‌గా ఉన్న దండకారణ్యంలో తనిఖీలను ముమ్మరం చేసింది.


దీంతో అక్టోబర్ 4వ తేదీన.. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మరణించారు. అయితే పోలీసులు మాత్రం 31 మంది వివరాలను మాత్రమే వెల్లడించారు. మిగిలిన వారిలో అగ్రనేతలు ఉన్నారంటూ ఓ ప్రచారం సైతం సాగింది. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు ఎవరు మరణించ లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన సరిగ్గా వారం రోజులకు మావోయిస్ట్ అగ్రనేత కిషన్ జీ భార్య సుజాత అలియాస్ మైనా బాయి‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారంటూ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి.


వైద్య చికిత్స కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి ఉమ్మడి భద్రచలం మీదగా హైదరాబాద్‌ వెళ్తుండగా ఆమెను అరెస్ట్ చేసినట్లు ఓ ప్రచారం సైతం సాగింది. సుజాత అరెస్ట్ పై పౌర హక్కుల సంఘాలు సైతం స్పందించాయి. కిషన్ జీ భార్యను అరెస్ట్ చేస్తే.. వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అలాంటి వేళ.. సుజాత అరెస్ట్‌పై మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చింది.


ఆమె అరెస్ట్ కాలేదని స్పష్టం చేసింది. పార్టీని నిర్వీర్యం చేసేందుకే రాజ్యం ఈ తరహా ఎత్తుగడలు వేస్తుందని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది రోజులకే.. సుజాత భర్త మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే.

For National News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 04:37 PM