Share News

Maratha Reservation row: ఆమరణ నిరాహార దీక్షకు మనోజ్ జారంగే అల్టిమేటం

ABN , Publish Date - Apr 14 , 2024 | 07:31 PM

మరాఠా రిజర్వేషన్ల వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వానికి మరాఠా రిజర్వేషన్ పోరాట నేత మనోజ్ జారంగే అల్టిమేటం ఇచ్చారు. మరాఠా రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించకుంటే జూన్ 4వ తేదీ నుంచి మరోసారి తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 Maratha Reservation row: ఆమరణ నిరాహార దీక్షకు మనోజ్ జారంగే అల్టిమేటం

ముంబై: మరాఠా రిజర్వేషన్ల వివాదం (Maratha Reervation row) చల్లారడం లేదు. తాజాగా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వానికి మరాఠా రిజర్వేషన్ పోరాట నేత మనోజ్ జారంగే (Manoj Jarange) అల్టిమేటం ఇచ్చారు. మరాఠా రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించకుంటే జూన్ 4వ తేదీ నుంచి మరోసారి తాను ఆమరణ దీక్షకు దిగుతానని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


''రాబోయే నెలల్లో మహాఠా రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరించుకుంటే జూన్ 4 నుంచి మరోసారి ఆమరణ దీక్ష చేపడతాను. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తప్పుదారి పట్టించింది. మహాయుతి ప్రభుత్వం మాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మరాఠా రిజర్వేషన్లపై చేసిందేమీ లేదు'' అని జారంగే చెప్పారు.

Hero Vijay: ఈ ఎన్నికల్లో ఇళయ దళపతి వర్గం ఎటువైపో?


ఎన్నికల్లో పోటీపై...

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై జారంగేను అడిగనప్పుడు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే జూన్ 6వ తేదీలోగా రిజర్వేషన్లు కల్పించకుంటే మరాఠా కమ్యూనిటీ సభ్యులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ''మా తల్లులు, సోదరీమణులు రోడ్లపై ఉన్నారు. నేను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. కానీ మా కమ్యూనిటీ మాత్రం ప్రభుత్వానికి ఓట్లతోనే సమాధానం చెబుతుంది. వారికి మేము 7 నెలలు సమయం ఇచ్చాం. అయినప్పటికీ మేము అడిగింది వాళ్లు చేయడం లేదు. మరాఠా కార్యకర్తలపై ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. వాళ్లు (పార్టీలన్నీ) మరాఠా కమ్యూనిటీని 40 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు. మేము మనస్ఫూర్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతాం'' అని జారంగే స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 14 , 2024 | 07:34 PM