Share News

Maratha reservation row: మనోజ్ జారంగే అమీతుమీ... నిరవధిక నిరాహార దీక్షకు అల్టిమేటం

ABN , Publish Date - Jan 15 , 2024 | 04:14 PM

మరాఠా రిజర్వేషన్ వివాదం మరింత ఉధృతం చేసేందుకు రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే నిర్ణయించారు. ఈనెల 26 నుంచి ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో కానీ, శివాజీ పార్క్ గ్రౌండ్‌లో కానీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. జనవరి 20న అంతర్‌వాలీ సరాతీ గ్రామం నుంచి పాదయాత్రగా ముంబై చేరుకుంటామని తెలిపారు.

Maratha reservation row: మనోజ్ జారంగే అమీతుమీ... నిరవధిక నిరాహార దీక్షకు అల్టిమేటం

ముంబై: మరాఠా రిజర్వేషన్ వివాదం (Maratha reservation row) మరింత ఉధృతం చేసేందుకు రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే (Manoj Jarange) తిరిగి కదం తొక్కనున్నారు. ఈనెల 26 నుంచి ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో కానీ, శివాజీ పార్క్ గ్రౌండ్‌లో కానీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. జనవరి 20న అంతర్‌వాలీ సరాతీ గ్రామం నుంచి పాదయాత్రగా ముంబై చేరుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఓబీసీ క్యాటగిరి కింద తమకు రిజర్వేషన్లు కల్పించాలని మరాఠా కమ్యూనిటీ కొంత కాలంగా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తోంది.


''మరాఠా కమ్యూనిటీ సభ్యులంతా అంతర్‌వాలీ సరాతీ గ్రామం నుంచి జనవరి 20వ తేదీ ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ప్రతిరోజూ మధ్యాహ్నం వరకూ పాదయాత్ర జరుగుతుంది. ఆ తర్వాత వాహనాలపై తదుపరి గమ్యస్థానానికి చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు'' అని తమ ఆందోళనా క్రమాన్ని మీడియాకు జారంగే తెలిపారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించే తీర్మానాన్ని జనవరి 20వ తేదీలోగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరితే ముంబైకి నిరసన ప్రదర్శన చేపట్టే అవసరం ఉండదన్నారు. ప్రూఫ్ ఆధారంగా అర్హులైన కుటుంబ సభ్యులందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని అన్నారు. అంతర్‌వాలి సరాతీలో రిజర్వేషన్ ఆందోళనల సందర్భంగా మరాఠా కమ్యూనిటీ సభ్యులపై గతంలో నమోదైన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Jan 15 , 2024 | 04:17 PM