Share News

Encounter: రెండ్రోజులుగా ఎదురు కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:11 PM

ఛత్తీస్‌ఘడ్‌‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి...

Encounter: రెండ్రోజులుగా ఎదురు  కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

ఛత్తీస్‌ఘడ్‌: ఛత్తీస్‌ఘడ్‌‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. నారాయణ్ పూర్ జిల్లాలోని కుతుల్, ఫరస్ భేడ, దంతెవాడ, కొడత మెట్ట అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ కాల్పుల్లో ఇప్పటికే 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఇంతకుమించే చనిపోయి ఉంటారని దీనిపై క్లారిటీ రావాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాల్పుల తీవ్రతను బట్టి చూస్తే భారీగానే మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రాని కల్లా ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


chhattisgarh-maoist-encount.jpg

ఎంత మంది చనిపోయారో!

కాగా.. ఛత్తీస్‌ఘడ్ అంటే ఒకప్పుడు సంగతి అటుంచితే.. ఇప్పుడు ఎన్‌కౌంటర్ అనేది మాత్రమే గుర్తొస్తోంది.! గత రెండు నెలల వ్యవధిలోనే ఛత్తీస్‌ఘడ్‌లో వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. తాజా ఘటనతో మావోలకు చావు దెబ్బ తగిలిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకూ 08 మంది మావోలు చనిపోవడం, ఇంకా ఎంతమంది చనిపోయారనే దానిపై క్లారిటీ రాలేదు. దీంతో భారీగానే ఎన్‌కౌంటర్ జరిగిందని.. లెక్కలేనంత మంది నక్సల్స్ చనిపోయి ఉండొచ్చన్నది పోలీసుల అనుమానిస్తున్నారు. సాయంత్రం కల్లా దీనిపై ఓ క్లారిటీ రానుంది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్ ఫోర్స్‌లు జాయింట్‌గా పాల్గొన్నాయి.

Updated Date - Jun 15 , 2024 | 12:17 PM