Share News

Mayawati: ముస్లింలపై మాయావతి గుర్రు.. భవిష్యత్తులో వారికి సీట్లు ఇచ్చే అంశంపై ఆలోచన

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:42 PM

ఉత్తరప్రదేశ్‌(UP) ఎన్ని్కల్లో గణనీయమైన సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటులో బీఎస్పీ గెలవలేకపోయింది.

Mayawati: ముస్లింలపై మాయావతి గుర్రు.. భవిష్యత్తులో వారికి సీట్లు ఇచ్చే అంశంపై ఆలోచన

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌(UP) ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటులో బీఎస్పీ గెలవలేకపోయింది. యూపీలో అత్యధిక సీట్లు సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుచుకోగా, బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.

ఒకప్పుడు యూపీని ఏకచ్ఛాత్రాదిపత్యంతో ఏలిన బీఎస్పీకి(BSP) ఒక్క సీటు రాకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి(Mayawati) అసహనం వ్యక్తం చేశారు. 2024 ఎన్నిక‌ల్లో బీఎస్పీ 35 మంది ముస్లింల‌కు సీట్లు ఇచ్చింది. త‌మ పార్టీ ముస్లింల‌కు స‌రైన ప్రాతినిధ్యాన్ని క‌ల్పించినా.. ఆ వర్గాల ప్రజలు బీఎస్పీని అర్థం చేసుకోలేక‌పోయార‌ని ఆమె పేర్కొన్నారు.


ఇందుకు సంబంధించి ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో ముస్లిం వ‌ర్గానికి క‌ల్పించే ప్రాతినిధ్యంపై సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ ఖాతా తెర‌వలేదు. 2019లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని 10 సీట్లు గెలుచుకుంది. ముస్లిం సామాజిక వర్గం దూరం కావడంపై లోతుగా అధ్యయనం చేయనున్నట్లు మాయావతి తెలిపారు.

బీఎస్పీలో ముస్లిం సామాజిక వ‌ర్గం కీల‌క‌మైంద‌ని, కానీ ఆ పార్టీని స‌రైన రీతిలో ముస్లింలు అర్థం చేసుకోలేక‌పోయిన‌ట్లు ఆరోపించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ సామాజిక వర్గానికి రాజకీయంగా పార్టీ తరఫున ఇచ్చే అవకాశాలపై ఆచితూచి వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల మాదిరిగా భవిష్యత్తులో నష్టం జరక్కుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

For Latest News and National News Click Here

Updated Date - Jun 05 , 2024 | 12:42 PM