Share News

Delhi: కోచింగ్ సెంటర్లలో అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Aug 08 , 2024 | 09:47 AM

రావూస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌ ఇష్యూతో మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. ఒక్కో కోచింగ్ సెంటర్‌ను పరిశీలిస్తున్నారు. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణాలు, సరైన అనుమతుల గురించి నిశీతంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Delhi: కోచింగ్ సెంటర్లలో అధికారుల తనిఖీలు
Delhi Coaching Centres

ఢిల్లీ: రావూస్ కోచింగ్ సెంటర్ (Delhi Coaching Centres) బేస్‌మెంట్‌ ఇష్యూతో మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. ఒక్కో కోచింగ్ సెంటర్‌ను పరిశీలిస్తున్నారు. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణాలు, సరైన అనుమతుల గురించి నిశీతంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. కరోల్ బాగ్, నజఫ్‌గఢ్, షాదారా ప్రాంతాల్లో ఉన్న కోచింగ్ సెంటర్లను మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. కరోల్ బాగ్‌లో నాలుగు కోచింగ్ సెంటర్లు బేస్ మెంట్లలో లైబ్రరీ ఏర్పాటు చేశాయని గుర్తించారు. షాదారా సౌత్ జోన్, నజాఫ్ గఢ్‌లో రెండు చొప్పున ఉన్నాయని వివరించారు. 8 కోచింగ్ సెంటర్లు. మరో చోట రెండు కోచింగ్ సెంటర్లను సీజ్ చేశామని ప్రకటించారు.


నోటీసులు..

కోచింగ్ సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించినందుకు భవన యజమానులు, కోచింగ్ సెంటర్లకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యార్థులు, ప్రజల భద్రత కోసం భవన నిర్మాణ చట్టాన్ని విధిగా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఇతర చోట్ల ఉన్న కోచింగ్ సెంటర్లను తనిఖీ చేపడుతామని స్పష్టం చేశారు. ‘తూర్పు ఢిల్లీలో మున్సిపల్ అధికారుల తనిఖీలు కొనసాగాయి. కోచింగ్ సెంటర్లు విధిగా నిబంధనలు పాటించాలి. ఏ కోచింగ్ సెంటరు ఖాతరు చేయకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం అని’ ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించారు.


లైబ్రరీలోకి నీరు..

రావూస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ లైబ్రరీ ఉంది. ఇటీవల వర్షపు నీరు వచ్చి, అక్కడ చదువుకుంటోన్న ముగ్గురు విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఢిల్లీలో ఉన్న కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించారు. ముగ్గురు విద్యార్థుల మృతి అంశంపై సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విద్యార్థుల మృతి కేసు విచారణను ఢిల్లీ పోలీసులు ప్రారంభించారు. ఆ కేసు విచారణను సీబీఐకి ఢిల్లీ హైకోర్టు అప్పగించింది.


Read More National News
and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 09:47 AM