Share News

Viral: వీళ్లేం.. మనుషులారా.. బాబోయ్.. కర్రతో మహిళపై దాడి..!!

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:56 PM

కొందరికి మానవత్వ ఉండదు. మంచి, చెడులు అస్సలు లెక్క చేయరు. తప్పు చేసిందంటే చాలు దారుణంగా కొట్టేందుకు సైతం వెనకాడరు. మేఘలాయలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడ్డును బాదినట్టు బాదారు.

Viral: వీళ్లేం.. మనుషులారా.. బాబోయ్.. కర్రతో మహిళపై దాడి..!!
men attack women

కొందరికి మానవత్వ ఉండదు. మంచి, చెడులు అస్సలు లెక్క చేయరు. తప్పు చేసిందంటే చాలు దారుణంగా కొట్టేందుకు సైతం వెనకాడరు. మేఘలాయలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడ్డును బాదినట్టు బాదారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. దద్దెంగ్రిలో గల పశ్చిమ గరో హిల్స్ వద్ద ఐదుగురు కలిసి మహిళపై దాడి చేశారు. మహిళపై దాడి చేసే సమయంలో చాలామంది గుమికూడారు. ఏ ఒక్కరు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. వీడియో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ బంధువులు కోరుతున్నారు. ఘటనపై నివేదిక అందజేయాలని పోలీసులను మేఘాలయ అసెంబ్లీ మహిళా సాధికారత కమిటీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే శాంటా మెరీ శైలా ఆదేశించారు.

Updated Date - Jun 27 , 2024 | 01:56 PM