Meteorological Department : జూన్‌లో ఇప్పటివరకు 20% వర్షపాత లోటు
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:03 AM
నైరుతి రుతుపవనాలు కొంచెం ముందుగానే వచ్చినా ఆశించిన మేరకు వర్షపాతం మాత్రం నమోదు కాలేదు.
న్యూఢిల్లీ, జూన్ 19: నైరుతి రుతుపవనాలు కొంచెం ముందుగానే వచ్చినా ఆశించిన మేరకు వర్షపాతం మాత్రం నమోదు కాలేదు. ప్రస్తుత సీజన్‌లో జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకూ 20% వర్షపాతం లోటు నమోదైంది. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర, చత్తీ్‌సగఢ్, ఒడిసా, బిహార్, జార్ఖండ్, ఏపీ తీర ప్రాంతంలో రుతుపవనాల విస్తరణ మరింత మెరుగ్గా ఉంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. జూన్ 1 నుంచి 18 మధ్య కాలంలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇది సాధారణం కంటే 20 శాతం తక్కువని వెల్లడించింది. మే 30 నాటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ 12 నాటికి కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు విస్తరించాయి.