Share News

Minister: మేడం.. మా వినతులను కొంచెం పరిశీలించండి..

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:11 PM

త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించాలని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Finance Minister Nirmala Sitharaman)ను రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు కోరారు.

Minister: మేడం.. మా వినతులను కొంచెం పరిశీలించండి..

- నిర్మలమ్మకు మంత్రి తంగం తెన్నరసు వినతి

చెన్నై: త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించాలని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Finance Minister Nirmala Sitharaman)ను రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు కోరారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ రూపకల్పనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇందులోభాగంగా, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక మంత్రులతో విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Rahul Gandhi: నిస్సహాయ స్థితిలో మోదీ సర్కార్.. రాహుల్ నిప్పులు


ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నురసు, ఆ శాఖ కార్యదర్శి ఉదయచంద్రన్‌, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్ళి ఆర్థిక మంత్రిని కలిసి, బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి కేటాయించాల్సిన వివిధ అంశాలకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు. ఇందులో ప్రధానంగా మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశ నిర్మాణ పనులు అనుమతి ఇవ్వడంతో పాటు నిధులను కేటాయించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన బాధిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల రూపకల్పనకు రూ.3 వేల కోట్లను కేంద్రం ఇవ్వాలని కోరారు. కేంద్రప్రభుత్వ పథకాల్లో కనిష్ఠంగా 50 శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని మంత్రి తంగం తెన్నరసు కోరారు.

nai2.2.jpg


ముఖ్యంగా తాంబరం - చెంగల్పట్టు ప్రాంతాల మధ్య నాలుగో లైను రైలు మార్గం, తిరుపత్తూరు - కృష్ణగిరి - హోసూర్‌ ప్రాంతాల మధ్య కొత్త రైల్వే మార్గం, అరుప్పుకోటై మీదుగా మదురై - తూత్తుకుడి మధ్య 143.5 కిలోమీటర్ల మార్గం నిర్మాణం, మీంజూరు - తిరువళ్లూరు - శ్రీపెరుంబుదూరు - ఓరగడం - సింగపెరుమాళ్‌ కోయిల్‌ - మధురాంతకం మార్గాలను కలుపుతూ రైలు మార్గం, చెన్నై - సేలం - కోయంబత్తూరులను కలుపుతూ సెమీ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌, రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టాలని కోరారు. ముఖ్యంగా తాంబరం - చెంగల్పట్టు మధ్య (ఎన్‌హెచ్‌ 32), చెంగల్పట్టు - దిండివనం వరకు ఎలివేటెడ్‌ రహదారి నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, చెన్నై - కన్నియాకుమారి ప్రాంతాలను కలుపుతూ 2005లో ఫోర్‌లేన్‌ మార్గాన్ని ప్రతిపాదించారని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని మంత్రి తంగం తెన్నరసు కేంద్ర ఆర్థిక మంత్రికి విఙ్ఞప్తి చేశారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 23 , 2024 | 12:11 PM