Minister: మావి సరదా మాటలే.. రజనీకాంత్‌తో స్పర్థల్లేవు!
ABN , Publish Date - Aug 27 , 2024 | 01:00 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాష్ట్ర సీనియర్ మంత్రి దురైమురుగన్(Minister Durai Murugan) ఎట్టకేలకు శాంతించారు. తమ ఇద్దరి వ్యాఖ్యలు సరదావని, వాటిని శత్రుత్వంగా మార్చవద్దంటూ సోమవారం వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
- వివరణ ఇచ్చిన మంత్రి దురైమురుగన్
- రజనీకాంత్ జోక్యంతో సమసిన వివాదం
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాష్ట్ర సీనియర్ మంత్రి దురైమురుగన్(Minister Durai Murugan) ఎట్టకేలకు శాంతించారు. తమ ఇద్దరి వ్యాఖ్యలు సరదావని, వాటిని శత్రుత్వంగా మార్చవద్దంటూ సోమవారం వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. గత శనివారం కలైవానర్ అరంగంలో మంత్రి ఈవీ వేలు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో తనకున్న సన్నిహిత సంబంధాలను తెలిపేలా రచించిన ‘కలైంజర్ ఎనుమ్ తాయ్’ అనే పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రజనీ ప్రసంగిస్తూ.. సీనియర్ మంత్రులు మాజీ విద్యార్థుల వంటివారిని, వారితో వేగడం హెడ్మాస్టర్ లాంటి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కష్టసాధ్యమని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇదికూడా చదవండి: Joe Biden: ప్రధాని మోదీకి ఫోన్ చేసి మెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కారణమిదే..
మరీ ముఖ్యంగా దురైమురుగన్ లాంటి సీనియర్లను పట్టుకోవడం చాలా కష్టమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వద్ద యేళ్ల తరబడిన పనిచేసిన సీనియర్ మంత్రులతోనే స్టాలిన్ ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలించడం హర్షణీయమన్నారు. ఈవ్యాఖ్యలపై వేలూరులో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్ స్పందిస్తూ.. పళ్లూడిపోయిన, గడ్డాలు పెరిగిన సీనియర్ హీరోలు ఇంకా నటిస్తుండటం వల్ల యువకులకు సినిమా అవకాశాలు దూరమవుతున్నాయని కటువుగా వ్యాఖ్యానించారు.
మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపాయి. రజనీ-దురైమురుగన్(Rajini-Duraimurugan) మధ్య వివాదం నెలకొన్నట్లేనని, ఇది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందోనన్న చర్చ కూడా మొదలైంది. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం రజనీకాంత్ ఓ సినిమా షూటింగ్ కోసం ఏపీకి వెళతూ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రి దురైమురుగన్ వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ.. మంత్రి దురైమురుగన్ తన చిరకాల మిత్రుడని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని, ఆయన తనపై ఎలాంటి విమర్శలు చేసినా బాధపడనని పేర్కొన్నారు.
తమ ఇద్దరి మధ్య స్నేహం చెక్కుచెదరదని పేర్కొన్నారు. ఆ తర్వాత వేలూరులో వీఐటీ విశ్వవిద్యాలయంలో మాజీముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి దురైమురుగన్ వద్ద విలేరరులు రజనీ స్పందన గురించి ప్రస్తావించినప్పుడు తమ సరదా వ్యాఖ్యలను ఎవరూ తీవ్రంగా భావించరాదని, తామిరువురుమూ ఎప్పటిలానే మంచి మిత్రులుగానే కొనసాగుతామని చెప్పారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News