Share News

Minister Udayanidhi: మంత్రిగారి మాస్టర్ ప్లాన్... అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:27 AM

త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపోటములపై యువజన విభాగానికి చెందిన కీలక నేతల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) భావిస్తున్నారు.

Minister Udayanidhi: మంత్రిగారి మాస్టర్ ప్లాన్... అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ

- మంత్రి ఉదయనిధి ప్లాన్‌

చెన్నై: త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపోటములపై యువజన విభాగానికి చెందిన కీలక నేతల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) భావిస్తున్నారు. ఇందుకోసం ఈ సమాలోచనల సమావేశాలు తేనాంపేటలోని యువజన విభాగం ప్రధాన కార్యాలయమైన అన్బాలయంలో నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే, లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో పార్టీతో పాటు మిత్రపక్షాల గెలుపోటములపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ‘ఎలక్షన్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ’ని ఏర్పాటుచేశారు. ఇందులో పార్టీ సీనియర్‌ నేతలు కేఎన్‌ నెహ్రూ, ఆర్‌ఎస్‌ భారతి, ఏవీ వేలు, తంగం తెన్నరసు, ఉదయనిధిలకు చోటుకల్పించారు. ఈ కమిటీ గత నెల 28వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా నేతలను ఆహ్వానించి అభిప్రాయాలను సేకరిస్తుంది. అదేవిధంగా యువజన విభాగానికి చెందిన నేతల నుంచి అభిప్రాయాలను తెలుసుకోవాలని మంత్రి ఉదయనిధి భావిస్తున్నారు. ఈ విభాగంలో దాదాపు 650 మంది ఆర్గనైజర్లు ఉండగా, వీరిని దశలవారీగా నగరానికి పిలిపించి అభిప్రాయాలను తెలుసుకోవాలని, ఇందుకోసం అన్బాలయంలో ఏర్పా ట్లు చేయాలని ఆయన ఆదేశించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

Updated Date - Feb 09 , 2024 | 11:28 AM