Share News

MLA: అతనెవరు.. మమ్మల్ని కొన్నారా...

ABN , Publish Date - Nov 27 , 2024 | 01:08 PM

చన్నపట్టణ ఎమ్మె ల్యేగా గెలిచిన ఉత్సాహంలో సీపీ యోగేశ్వర్‌ మాట్లాడుతున్నారని జేడీఎస్‌ ఎమ్మెల్యే శారదా పూర్యానాయక్‌(JDS MLA Sarada Pooryanayak) తిరగబడ్డారు. శివమొగ్గలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతనెవరు.. మమ్మల్ని కొన్నారా... ఆయనను నమ్ముకుని మేం గెలవలేదన్నారు.

MLA: అతనెవరు.. మమ్మల్ని కొన్నారా...

- సీపీ యోగేశ్వర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన జేడీఎస్‌ ఎమ్మెల్యే

బెంగళూరు: చన్నపట్టణ ఎమ్మె ల్యేగా గెలిచిన ఉత్సాహంలో సీపీ యోగేశ్వర్‌ మాట్లాడుతున్నారని జేడీఎస్‌ ఎమ్మెల్యే శారదా పూర్యానాయక్‌(JDS MLA Sarada Pooryanayak) తిరగబడ్డారు. శివమొగ్గలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతనెవరు.. మమ్మల్ని కొన్నారా... ఆయనను నమ్ముకుని మేం గెలవలేదన్నారు. అతడి సలహాలతో రాజకీయాలు చేస్తున్నామా..? అంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీ యోగేశ్వర్‌(CP Yogeshwar) మాకు ఆపరేషన్‌ హస్త టాస్క్‌ ఇస్తే జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌కు వచ్చేలా చేర్చుకుంటామన్న వ్యాఖ్యలపై శారదా తిప్పికొట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: Nagendra: మళ్లీ కేబినెట్‌లోకి నాగేంద్ర..


pandu2.2.jpg

ఎమ్మెల్యేగా గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవా లన్నారు. ఆయనకు అటువంటి వ్యవహారాలే అలవాటన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే తంతు అనేలా ఉన్నారన్నారు. అహం ప్రతి చోటా చూపరాదన్నారు. జేడీఎస్‌(JDS)లో ఒకరిద్దరికి ముఖ్యనేతలతో వ్యక్తిగత విబేధాలు ఉండవచ్చునని అంతమాత్రాన పార్టీ వీడ రన్నారు. మధు బంగారప్ప జేడీఎస్‌ నుంచి వెళ్లినవారేనని, అందరినీ లాగేసుకొస్తామనడం తప్పు అన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 01:10 PM