Share News

MLC: కాంగ్రెస్ అంటే.. వారిద్దరే కాదు..

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:56 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో తక్కువసీట్లు సాధించడంపై అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని పంపింది. పార్టీ సీనియర్‌ నేత మధుసూధన్‌ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ బెంగళూరుకు వచ్చారు.

MLC: కాంగ్రెస్ అంటే.. వారిద్దరే కాదు..

- మిస్త్రీ కమిటీకి బీకే హరిప్రసాద్‌ నివేదిక..!

బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్‌(Congress ) అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో తక్కువసీట్లు సాధించడంపై అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని పంపింది. పార్టీ సీనియర్‌ నేత మధుసూధన్‌ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ బెంగళూరుకు వచ్చారు. కేపీసీసీ(KPCC)లోని భార్‌తోజోడో భవన్‌లో గురువారం వారు అభిప్రాయ సేకరణ ప్రక్రియ సాగించారు. డీసీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు డీకే శివకుమార్‌ ఓ ప్రత్యేక నివేదికను ఇచ్చారు. మిస్త్రీ కమిటీతో పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌(MLC BK Hariprasad) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఓటమికి కారణాలపై ఓ నివేదికను సమర్పించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న హరిప్రసాద్‌ నివేదికకు కమిటీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఇదికూడా చదవండి: Deputy CM: తప్పు చేశాం.. సరిదిద్దుకుంటాం..


రాష్ట్ర కాంగ్రెస్‌ అంటే కేవలం సీఎం, డీసీఎంలు ఇద్దరు మాత్రమే కాదని నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలవేళ సమష్టిగా పనిచేసినందుకు సత్ఫలితాలు వచ్చాయని అయితే లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ల సలహాలు పట్టించుకోలేదని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు మంత్రుల కుటుంబికులకు టిక్కెట్లు ఇవ్వడం రాష్ట్రస్థాయిలో వెనుకబాటుకు కారణమైందని, కార్యకర్తలను పరిగణించలేదని, బోర్డులు కార్పొరేషన్‌ల నియామకాలలో సీఎం, డీసీఎం(CM, DCM) మద్దతుదారులకే అవకాశం ఇచ్చారని రాష్ట్రంలో అత్యధిక జనాభా కల్గిన లింగాయత, ఒక్కలిగ సముదాయాల విశ్వాసం పొందడంలో విఫలమయ్యారని తీరప్రాంత జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరపలేదని వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: రన్‌వే పక్కనే గుడ్లు పెట్టిన పక్షి.. సోషల్‌ మీడియాలో వైరల్‌


ఇప్పటికే సీఎం సిద్దరామయ్య ‘ముడా’ అవినీతి ఆరోపణలతో తలమునకలై తల్లడిల్లుతుండగా డీసీఎం డీకే శివకుమార్‌ బెంగళూరు గ్రామీణలో ఓటమితో వెనుకడుగు వేసినట్లయ్యింది. తాజాగా అధిష్ఠానం కమిటీకి ఎన్నికల్లో ఓటమిపై వారిద్దరినే బాధ్యులను చేస్తూ సీనియర్‌ నేత హరిప్రసాద్‌ నివేదిక ఇవ్వడం ఇద్దరికి కొత్త చిక్కులు పెట్టేలా ఉంది. మరింతమంది డీసీఎంలు, నాయకత్వ మార్పు చర్చలకు వారంక్రిందటే తెరపడగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కొత్త వివాదం తలెత్తింది.


ఇదికూడా చదవండి: Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 12:56 PM