Mallikarjun Kharge: మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు... ఖర్గే జోస్యం
ABN , Publish Date - Jun 15 , 2024 | 03:05 PM
నరేంద్ర మోదీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచ్చిందని, అది త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు మోదీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అది ఏ సమయంలోనైనా కూలిపోవచ్చని అన్నారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచ్చిందని, అది త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు మోదీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అది ఏ సమయంలోనైనా కూలిపోవచ్చని అన్నారు. "కేంద్రంలో బలహీనమైన, కిచడీ ప్రభుత్వం ఉంది. పేకముక్కల్లా ఎప్పుడైనా కుప్పకూలొచ్చు. అయితే ఎప్పుడు అనేదే ప్రశ్న. ఏం జరుగుతుందో చూద్దాం'' అని ఖర్గే పేర్కొన్నారు.
Bangalore: సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలిగా..
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవచ్చని మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని 'ఇండియా' కూటమి తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. అయితే, చంద్రబాబునాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, ఏక్‌నాథ్ షిండే వండి భాగస్వాములతో కలిసి మెజారిటీ మార్క్ (272)ను దాటింది. నరేంద్ర మోదీ రాజకీయ కెరీర్‌లో బీజేపీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలుచుకోకపోవడం ఇదే ప్రథమం. కాగా, 2019లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకుని తమ బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' బ్లాక్ 234 సీట్లు గెలుచుకుని లోక్‌సభలో బలమైన విపక్షంగా నిలిచింది.
Read Latest Telangana News and National News