Share News

Bengaluru: మోదీ హఠావో.. దేశ్‌ బచావో: ఖర్గే

ABN , Publish Date - May 02 , 2024 | 03:40 AM

మోదీ హఠావో.. దేశ్‌ బచావో’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లకు పిలుపునిచ్చారు.

Bengaluru: మోదీ హఠావో.. దేశ్‌ బచావో: ఖర్గే

బెంగళూరు, మే 1(ఆంధ్రజ్యోతి): ‘మోదీ హఠావో.. దేశ్‌ బచావో’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం యాదగిరిలో బుధవారం నిర్వహించిన ప్రచారసభలో ఖర్గే ప్రసంగించారు. ప్రధాని మోదీని గద్దె దించాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఓటర్లను కోరారు. ఈనెల 7న జరిగే పోలింగ్‌లో కాంగ్రె్‌సను గెలిపించాలన్నారు.


యాదగిరి ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్‌ నిజాంల పాలనలో ఉండేదని, హిందూ ముస్లింల మధ్య విభేదాలు ఉండేవి కావని తెలిపారు. అయితే ప్రధాని మోదీ ఇక్కడ చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. కేవలం ఓట్ల కోసమే శ్రీరాముడు, అయోధ్య వంటి అంశాలను మోదీ ప్రస్తావిస్తున్నారని ఆక్షేపించారు. పేదలు ఇంతవరకు పేదలుగానే ఉండగా ధనవంతులు శ్రీమంతులయ్యారన్నారు.

Updated Date - May 02 , 2024 | 03:40 AM