PM Modi: పశ్చిమబెంగాల్‌లో మోదీ రెండ్రోజుల పర్యటన
ABN , Publish Date - Feb 23 , 2024 | 03:20 PM
ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్ లో పర్యటించనున్నారు. మార్చి 1,2 తేదీల్లో ఆయన బెంగాల్‌లోని రెండు కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఆరాంబాగ్, కష్ణనగర్‌లో ప్రధాని పర్యటిస్తారని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్ (West Bengal)లో పర్యటించనున్నారు. మార్చి 1,2 తేదీల్లో ఆయన బెంగాల్‌లోని రెండు కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఆరాంబాగ్, కష్ణనగర్‌లో ప్రధాని పర్యటిస్తారని చెబుతున్నారు. 2019లో ఈ రెండు స్థానాల్లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. సందేశ్‌ఖాలి ఘటనతో బెంగాల్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో బెంగాల్‌లో మోదీ పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, మార్చి 6న మరోసారి బెంగాల్‌లోని బరసాత్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తారని తెలుస్తోంది. ఆరోజు జరిగే మహిళా ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ తెలిపారు. సందేశ్‌ఖాలి బాధిత మహిళలతో మోదీ సమావేశమవుతారా అని అడిగినప్పుడు, బాధిత మహిళలు ప్రధానిని కలుసుకోవాలని కోరుకుంటే కచ్చితంగా అందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.