Loksabha Elections 2024: క్రూజ్‌లో నమో ఘాట్‌కు మోదీ
ABN , Publish Date - May 14 , 2024 | 10:09 AM
నేడు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. నామినేషన్ కంటే ముందు దశాశ్వమేధ ఘాట్ సందర్శించనున్నారు. అనంతరం క్రూజ్‌లో నమో ఘాట్ వరకూ ప్రయాణించనున్నారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది.
ఢిల్లీ : ప్రధాని మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొంటారు. నామినేషన్ కన్నా ముందు దశాశ్వమేధ ఘాట్‌ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. తర్వాత క్రూజ్‌లో నమో ఘాట్ వెళతారు. అక్కడినుంచి కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.
ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్బీ, బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నేతలు చంద్రబాబు (టీడీపీ), పవన్ కల్యాణ్ (జనసేన), జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), అనుప్రియ (అప్నాదళ్), ఓంప్రకాశ్ రాజ్‌భర్ (సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) తదితరులున్నారు.
వారాణసి లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి పోటీచేస్తున్న నరేంద్ర మోదీ సోమవారం ఆరు కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. విద్యా రంగ సంస్కర్త మదన్‌మోహన్ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి తన యాత్రను ప్రారంభించారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్దఎత్తున గుమిగూడి రోడ్‌షోకు స్వాగతం పలికారు. నరేంద్రమోదీపై పూలవర్షం కురిపించారు. మంగళవారం ఆయన తన నామినేషన్ పత్రాలను వారాణసీలో రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు సహా దాదాపుగా ఆ కూటమి నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత
పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు
Read Latest AP News and Telugu News