Share News

Mamata Banerjee: గవర్నర్ వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గరుంది.. మమతా బెనర్జీ వెల్లడి

ABN , Publish Date - May 11 , 2024 | 07:01 PM

రాజ్‌భవన్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్‌ పై వచ్చిన ఆరోపణల వ్యవహారం ముదురుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఎదురుదాడికి దిగారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని శనివారంనాడు నిలదీశారు.

Mamata Banerjee: గవర్నర్  వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గరుంది.. మమతా బెనర్జీ వెల్లడి

కోల్‌కతా: రాజ్‌భవన్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పశ్చిమబెంగాల్ (WEst Bengal) గవర్నర్ (Governer) సి.వి.ఆనంద్ బోస్‌ (CV Ananda Bose)పై వచ్చిన ఆరోపణల వ్యవహారం ముదురుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి ఎదురుదాడికి దిగారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని శనివారంనాడు నిలదీశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ గవర్నర్ ఇటీవల విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా ఆమె తప్పుపట్టారు. అది ఎడిట్ చేసిన వీడియో అని తెలిపారు. తన వద్ద మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్ కూడా ఉందని ఆమె వెల్లడించారు.


''ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ విడుదల చేశారు. మొత్తం ఫుటేజ్‌ను నేను చూశాను. అందులోని సన్నివేశాలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. నా దగ్గర మరో వీడియో కూడా ఉంది. గవర్నర్ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది'' అని మమత వ్యాఖ్యానించారు. ఆయన గవర్నర్‌గా ఉన్నంత వరకూ తాను రాజ్‌భవన్‌కు వెళ్లేదిలేదని, వీధుల్లోనే ఆయనను కలిసేందుకు ప్రాధాన్యతనిస్తానని చెప్పారు.


వేధింపుల వ్యవహారం ఏమిటి?

గవర్నర్ తనతో రెండు సార్లు అభ్యంతరకరంగా ప్రవర్తించారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఒక మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణలను గవర్నర్ కొట్టివేశారు. మే 2వ తేదీకి సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్‌ను ఆయన సాధారణ పౌరలకు చూపించారు. అయితే ఇందులో తన ముఖాన్ని బ్లర్ చేయలేదని సదరు మహిళా ఉద్యోగిని ఆవేదన చెందారు. తాజాగా, ఇది ఎడిటెడ్ వీడియో అంటూ మమతా బెనర్జీ ప్రకటించడంతో పాటు, మరో వీడియో కూడా తనదగ్గర ఉందని వెల్లడించారు. గవర్నర్ రాజీనామా చేయకపోవడాన్ని మరోసారి నిలదీశారు. కాగా, ఈ వ్యవహారంపై గవర్నర్ ఇటీవల రాజ్‌భవన్ సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చారు. రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ పదవుల్లో ఉన్నంత వరకూ వారిపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరపరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 స్పష్టంగా చెబుతోందని, ఆ దృష్ట్యా ఎలాంటి పోలీస్ ఎంక్వయిరీని సిబ్బంది పట్టించుకోనవసరం లేదని వారికి సూచించారు.

Updated Date - May 11 , 2024 | 07:02 PM