Share News

తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం

ABN , Publish Date - Oct 21 , 2024 | 02:59 AM

బెంగళూరు ఉత్తర తాలూకాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రుణం చెల్లించలేదని అతని మైనర్‌ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి ఒడిగట్టాడు.

తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం

బెంగళూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు ఉత్తర తాలూకాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రుణం చెల్లించలేదని అతని మైనర్‌ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి ఒడిగట్టాడు. మాదనాయకనహళ్లిలో ఆదివారం ఈ దారుణ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు రవికుమార్‌ (39) వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు అప్పు తీసుకుని రూ.30 వేలు తిరిగి చెల్లించాడు. రూ.40 వేలు అసలుతోపాటు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వసూలు చేసుకునేందుకు తరచూ రవికుమార్‌ అతని ఇంటికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో వెళ్లి అప్పు చెల్లించాలని బాలికను బెదిరించాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు.

Updated Date - Oct 21 , 2024 | 02:59 AM