Monsoon tracker: ఆ యా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ
ABN , Publish Date - Jul 05 , 2024 | 08:15 PM
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
న్యూఢిల్లీ, జులై 05: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్ నుంచి ఈశాన్య దిశగా ద్రోణి.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరం వైపు రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఆ యా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. దేశంలోని వాయువ్యంతోపాటు తూర్పు వైపు రానున్న 4, 5 రోజుల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే జులై 3 నుంచి జులై 7వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వివరించింది.
Also Read: Lalu Prasad Yadav: త్వరలో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు.. సిద్దంకండి
Also Read: Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!
ఇక గత 24 గంటల్లో రాజస్థాన్ టొంక్ జిల్లాలో 176 మి.మి వర్షపాతం నమోదయిందని తెలిపింది. ఇక జులై 9వ తేదీన పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశముందంది. అలాగే డార్జిలింగ్, జల్పాయిగురి, కాలింపొంగ్, కూచిబిహార్ జిల్లాలో సైతం ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. మరోవైపు భారీ వర్షాలతో తీస్తా, జల్ధకా, సంకోష్, తోర్సా నదుల్లో నీటి ప్రవాహ స్థాయి భారీగా పెరిగిందని వివరించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దాదాపు 77 ప్రాంతాల్లో రహదారులను మూసి వేశారు. ఇక శనివారం భారీ వర్షాలు, ఉరుముల, పిడుగులు పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో సిమ్లా వాతావరణ శాఖ శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: Crisil: ధర పెరుగుదలతో మాడిపోతున్న ‘తాళింపు’
Also Read: AP Ministers: జగన్ వైఖరిపై మంత్రులు మండిపాటు
Also Read: Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’
Also Read: LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్
Also Read: Bihar: 11 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News