Share News

MP: రక్తపోటు తగ్గించుకోవడానికే బీజేపీ రాష్ట్ర చీఫ్ పాదయాత్ర..

ABN , Publish Date - Jan 11 , 2024 | 09:59 AM

వైద్యుల సూచనల మేరకు రక్తపోటు తగ్గించుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కొద్ది దూరం పాదయాత్ర చేస్తున్నాడని ధర్మపురి ఎంపీ సెంథిల్‌కుమార్‌(Dharmapuri MP Senthilkumar) ఎద్దేవా చేశారు.

MP: రక్తపోటు తగ్గించుకోవడానికే బీజేపీ రాష్ట్ర చీఫ్ పాదయాత్ర..

- ధర్మపురి ఎంపీ సెంథిల్‌ కుమార్‌ చురక

పెరంబూర్‌(చెన్నై): వైద్యుల సూచనల మేరకు రక్తపోటు తగ్గించుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కొద్ది దూరం పాదయాత్ర చేస్తున్నాడని ధర్మపురి ఎంపీ సెంథిల్‌కుమార్‌(Dharmapuri MP Senthilkumar) ఎద్దేవా చేశారు. ధర్మపురి ఎస్వీ రోడ్డులో ఎంపీ నియోజకవర్గ నిధుల నుంచి ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్‌ లైట్లను మంగళవారం ప్రారంభించి న ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ... అన్నామలై చేపట్టింది పాదయాత్ర కాదన్నారు. రక్తపోటు, అధిక ఒత్తిడి తదితర సమస్యలు తగ్గించుకొనేందుకు వైద్యుల సూచనల మేరకు రోజూ కొద్ది దూరం నడుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నిజమైన పాదయాత్ర అన్నారు. ప్రతి జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్‌ పాదయాత్ర సాగిందన్నారు. ప్రధానమంత్రి గృహ కల్ప పేరిట చేపట్టిన పథకానికి వినియోగించే నిధులు ప్రజల పన్నుల రూపంలో చెల్లించినవేనని, అవేమీ ప్రధాని జేబు నుంచి తీసిచ్చివని కావన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు 60 శా తం కేంద్రం, 40 శాతం రాష్ట్రప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నాయని ఎంపీ తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 09:59 AM