MUDA Case: సీఎంకు లోకాయుక్త పోలీసులు సమన్లు
ABN , Publish Date - Nov 04 , 2024 | 07:40 PM
ముడా కేసు విచారణలో భాగంగా సిద్ధరామయ్య భార్య పార్వతిని గత అక్టోబర్ 25న లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బెంగళూరు: మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపు కేసులో ప్రశ్నించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు లోకాయుక్త పోలీసులు సోమవారంనాడు సమన్లు పంపారు. నవంబర్ 6వ తేదీ ఉదయం విచారణకు హాజరుకావాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఎంకు సమన్లు పంపిన విషయాన్ని లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
MiG-29 Fighter Jet: ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 విమానం
హాజరవుతా...
లోకాయుక్త పోలీసులు సమన్లు పంపడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ''నిజమే. ముడా కేసుకు సంబంధించి మైసూరు లోకాయుక్త పోలీసులు నోటీసులు పంపారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్త ముందు హాజరవుతా'' అని చెప్పారు. ముడా కేసు విచారణలో భాగంగా సిద్ధరామయ్య భార్య పార్వతిని గత అక్టోబర్ 25న లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2021లో ముడా అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయనగర్‌లో భూమిని కేటాయించారు. విజయనగరంలో భూమి ధర కేసరెలో భూమి కంటే చాలా ఎక్కువని, ముడా ద్వారా ఈ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆర్టీఐ కార్యకర్త ఇబ్రహీం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీఎంపై వచ్చిన ఆరోపణలపై విచారణకు గవర్నర్ ఇటీవల ఆదేశించగా, దీనిని హైకోర్టులో సిద్ధరామయ్య సవాలు చేసినప్పటికీ ఊరట దక్కలేదు. తొలుత ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పిన సిద్ధరామయ్య ఆ తర్వాత తన భార్యకు కేటాయించిన ప్లాట్లను ముడాకు తిరిగి అప్పగించారు. అయినప్పటికీ చిక్కుల నుంచి ఆయన బయట పడలేదు. విచారణకు హాజరుకావాలంటూ లోకాయుక్త పోలీసులు సీఎంకు తాజాగా నోటీసులు పంపడంతో మరింత ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..
Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుకింగ్, ట్రాకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..