Share News

MUDA Scam Case: సిద్ధరామయ్యపై లోకాయుక్త దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు ఆదేశం

ABN , Publish Date - Sep 25 , 2024 | 02:43 PM

క ర్ణాటక లోకాయుక్త మైసూరు పోలీసులు 'ముడా' స్కామ్‌పై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ బుధవారం ఆదేశించారు.

MUDA Scam Case: సిద్ధరామయ్యపై లోకాయుక్త దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు ఆదేశం

బెంగళూరు: మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ (MUDA) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన విచారణను కర్ణాటక లోకాయుక్త (Lokyukta)కు అప్పగిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. క ర్ణాటక లోకాయుక్త మైసూరు పోలీసులు 'ముడా' స్కామ్‌పై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు.

Jammu and Kashmir Elections: ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న విదేశీ దౌత్యవేత్తల బృందం


సిద్ధరామయ్య భార్య పార్వతికి 14 స్థలాలను చట్టవిరుద్ధంగా 'ముడా' కేటాయించిందనే ఆరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. తనపై విచారణకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును పిటిషనర్ స్నేహమయి కృష్ణ ప్రైవేటు ఫిర్యాదుతో ఆశ్రయించారు.


Read More National News and Latest Telugu News

Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

Updated Date - Sep 25 , 2024 | 02:43 PM