Share News

Mukthiranjan : నన్ను కొట్టిందని చంపేశా!

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:55 AM

కర్ణాటకలో మహాలక్ష్మి అనే మహిళను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటనలో నిందితుడు ముక్తిరంజన్‌ ఒడిశాలోని తన స్వగ్రామంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Mukthiranjan : నన్ను కొట్టిందని చంపేశా!

బెంగళూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో మహాలక్ష్మి అనే మహిళను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటనలో నిందితుడు ముక్తిరంజన్‌ ఒడిశాలోని తన స్వగ్రామంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన డెత్‌ నోట్‌లో నిందితుడు పలు అంశాలు పేర్కొన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకోవాలంటూ మహాలక్ష్మి ముక్తిరంజన్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె తనపై దాడి చేయడంతో, ముక్తిరంజన్‌ తిరిగి కొట్టాడు. మహాలక్ష్మి కిందపడి చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు బ్లేడ్‌తో ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఈ విషయాలన్నీ ఇంటికి వెళ్లాక తన సోదరుడు శక్తిరంజన్‌కు చెప్పాడు. కాగా, ముక్తిరంజన్‌ 24న తమ ఊరి శ్మశానంలో ఉరేసుకొన్నాడు.

Updated Date - Sep 28 , 2024 | 04:55 AM