cheetah: పార్క్ నుంచి పారిపోయిన చిరుత.. ఆందోళనలో ప్రజలు
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:09 PM
cheetah: నేషనల్ పార్క్ నుంచి వాయు అనే చిరుత తప్పించుకొంది. దీంతో మధ్యప్రదేశ్‌లోని షియోర్‌పూర్ నగర ప్రజలు హడలిపోతున్నారు. నగరంలో అర్థరాత్రి చిరుత సంచారాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది.
భోపాల్, డిసెంబర్ 26: మధ్యప్రదేశ్‌లోని షియోర్‌పూర్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. స్థానిక కునో నేషనల్ పార్కు నుంచి పారిపోయిన చిరుత.. షియోర్‌పూర్ రహదారులపై స్వేచ్ఛగా సంచరిస్తోంది. రాత్రి పొద్దు పోయిన తర్వాత.. రహదారులపై సంచరిస్తున్న చిరుతను... అటుగా వెళ్తున్న వాహనదారుడు తన సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుత సంచారంతో.. షియోర్‌పూర్ ప్రజలు భయాందోళన చెందుతోన్నారు. ఈ చిరుతను త్వరగా బంధించాలని అటవీ శాఖ అధికారులకు షియోర్‌పూర్ ప్రజలు విజ్జప్తి చేశారు.
డిసెంబర్ 4వ తేదీన వాయు పేరున్న చిరుత కునో నేషనల్ పార్కు నుంచి వెళ్లి పోయింది. గత మూడు రోజులుగా.. మరి ముఖ్యంగా అర్థరాత్రుళ్లు.. షియోర్‌పూర్ పట్టణ వీధుల్లో తిరుగుతోంది. గత మూడు రోజులుగా.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల, జనావాస ప్రాంతాలతోపాటు వీర సావర్కర్ స్టేడియం వద్ద పలు మార్లు చూశామని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
అలాగే కునో నేషనల్ పార్క్ సమీపంలో సైతం చిరుత వాయును ప్రత్యక్షంగా చూశామని పేర్కొంటున్నారు. ఇవి వీధి కుక్కల కోసం వేట సాగిస్తున్నాయని వారు చెబుతున్నారు. అయితే చిరుతలు తమపై దాడి చేస్తాయనే భయంతో వీధి కుక్కలు ఏడుపు వినిపిస్తోందని సియోర్‌పూర్ వాసులు వివరిస్తున్నారు.
ఈ వ్యవహరంపై చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ ఉత్తమ్ శర్మ స్పందించారు. చిరుత ఏ ప్రదేశంలో ఉందన్నది తాము గుర్తించ లేదన్నారు. షియోర్‌పూర్‌లో చిరుత లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పలు బృందాలు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. చిరుత కోసం 24 గంటల పాటు సదరు బృందాలు ట్రాక్ చేస్తున్నాయి.
అయితే చిరుత కదలికలపై షియోపూర్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక డిసెంబర్ 4వ తేదీన అగ్ని, వాయు చిరుతలు జైలు నుంచి తప్పించుకొన్నాయి. వాయు మాత్రం రాజస్థాన్ వైపు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిందని.. అగ్ని మాత్రం మరో మార్గంలో వెళ్లిందని ట్రాకింగ్ బృందం వెల్లడించింది.
For National News And Telugu News