Share News

Mumbai: బస్సు బీభత్సం.. ఏడుగురు మృతి

ABN , Publish Date - Dec 10 , 2024 | 09:35 AM

ముంబయి మహానగరంలో బస్సు.. పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. అలాగే ఈ ప్రమాదంలో 49 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాబా ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.

Mumbai: బస్సు బీభత్సం.. ఏడుగురు మృతి

ముంబయి, డిసెంబర్ 10: ముంబయి మహానగరంలో బస్సు బీభత్సం సృష్టించింది. బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌‌పోర్ట్ ( బీఈఎస్‌టీ) కు చెందిన బస్సు పాదచారులపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. జోన్ 5 డీసీపీ గణేశ్ గవాడే మంగళవారం వెల్లడించారు. బస్సు.. కుర్లా నుంచి అంధేరి వెళ్తుండగా ఈ ప్రమాదం సోమవారం రాత్రి చోటు చేసుకుందని తెలిపారు.

Also Read: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత


బ్రెక్స్ ఫెయిల్ కావడంతో.. బస్సు అదుపు తప్పి పాదచారులు, వాహనాలపైకే కాకుండా.. జనావాసాల్లోకి సైతం దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అందులోభాగంగా బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని వివరించారు. ఇక ఈ బస్సు పోలీస్ వాహనంపైకి సైతం దూసుకు వెళ్లడంతో.. నలుగురు పోలీసులు గాయపడ్డారన్నారు. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానికులు బస్సు డ్రైవర్‌పై దాడి చేశారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.

Also Read: కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ కన్నుమూత


స్పందించిన ప్రత్యక్ష సాక్షలు..

రహదారిపై వెళ్తున్న వాహనాలపైకి ఈ బస్సు వేగంగా దూసుకెళ్లిందన్నారు. దీంతో బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయని తెలిపారు. ఈ బస్సు అకస్మాత్తుగా వాహనాలతోపాటు పాదచారులపైకి దూసుకెళ్లి.. అనంతరం బుద్ధ కాలనీలోకి వెళ్లిందని చెప్పారు. అనంతరం బస్సు ఆగిపోవడంతో.. బస్సు నుంచి డ్రైవర్‌ను బయటకు తీసుకు వచ్చినట్లు అన్సారీ వెల్లడించారు.


ఈ ప్రమాదం కారణంగా రక్తపు మడుగులో పడి ఉన్న వారిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మరో యువకుడు జైద్ అహ్మద్ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ వెళ్లేందుకు రహదారిపైకి వచ్చానని.. అదే సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని తెలిపారు. ఈ సందర్భంగా క్షతగాత్రులను ఆటో రిక్షా ద్వారా బాబా ఆసుపత్రికి తీసుకు వెళ్లామన్నారు.

For National News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 09:37 AM