Share News

Mumbai : దావూద్‌ మాత్రమే ఉగ్రవాది.. అతని గ్యాంగ్‌ కాదు

ABN , Publish Date - Jul 21 , 2024 | 06:05 AM

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీంపై వ్యక్తిగత హోదాలో మాత్రమే ఉగ్రవాది అన్న ముద్ర ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల అతని గ్యాంగ్‌లో ఉన్న అనుచరులను ఉపా చట్టం కింద అరెస్టు చేయలేరని తెలిపింది.

Mumbai : దావూద్‌ మాత్రమే ఉగ్రవాది.. అతని గ్యాంగ్‌ కాదు

ముంబయి, జూలై 20: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీంపై వ్యక్తిగత హోదాలో మాత్రమే ఉగ్రవాది అన్న ముద్ర ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల అతని గ్యాంగ్‌లో ఉన్న అనుచరులను ఉపా చట్టం కింద అరెస్టు చేయలేరని తెలిపింది.

ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్టయిన అతని అనుచరులు ఫయాజ్‌ భివాండీవాలా, పర్వేజ్‌ వైద్‌ అనే నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ భారతి డాంగ్రే, జస్టిస్‌ మంజూషా దేశ్‌పాండేల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గంజాయి ఉందన్న కారణంతో వారిద్దరిపై పోలీసులు ఉపా, ఇతర ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఉగ్రవాద ముఠాలో ఉంటూ బలవంతంగా సొమ్ము గుంజడం వంటి ఆరాచకాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం డి-గ్యాంగ్‌ను ఉపా చట్టంలోని సెక్షన్‌ 20 కింద ఉగ్రవాద ముఠాగా ప్రకటించలేదని తెలిపింది. ఈ కారణాలతో బెయిల్‌ ఇస్తున్నట్టు తెలిపింది.

Updated Date - Jul 21 , 2024 | 06:05 AM