Share News

Rains: స్కూళ్లకు సెలవు.. విమానాలు రద్దు..!!

ABN , Publish Date - Jul 08 , 2024 | 09:50 PM

దేశ వాణిజ్య రాజధాని ముంబై వర్షాలతో చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలతో ఏ వీధి చూసిన వరదనీటితో కనిపిస్తోంది. వర్షాల వల్ల స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వర్షపు నీటితో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. 50 విమానాలను రద్దు చేశారు.

Rains: స్కూళ్లకు సెలవు.. విమానాలు రద్దు..!!
Mumbai Rains

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై (Mumbai ) వర్షాలతో చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలతో ఏ వీధి చూసిన వరదనీటితో కనిపిస్తోంది. వర్షాల వల్ల స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వర్షపు నీటితో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. 50 విమానాలను రద్దు చేశారు. ఎయిర్ పోర్టు వచ్చే ముందే సంబంధిత ఫ్లైట్ జర్నీ ఉందో లేదో చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో ముందుగా విమాన సర్వీసులను నిలిపివేశారు. అర్ధరాత్రి 2.22 గంటల నుంచి 3.40 గంటల వరకు 27 విమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్ డైవర్ట్ చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.


For
Latest News and National News click here

Updated Date - Jul 08 , 2024 | 09:50 PM