Woman: ఏడాదికి రూ.కోటి సంపాదించే వరుడు కావలెన్.. సోషల్ మీడియాలో పోస్ట్, వైరల్
ABN , Publish Date - Apr 03 , 2024 | 05:59 PM
వరుడి గురించి ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏడాదికి కోటి సంపాదించే వరుడు కావాలని ఆశ పడింది. మెడికల్ ఫీల్డ్‌లో సర్జన్ అయితే బాగుంటుందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా రిప్లై ఇస్తున్నారు.
ముంబై: ఒకప్పటిలా పరిస్థితులు లేవు. పెళ్లి గురించి తల్లిదండ్రులు కాకుండా యువతీ యువకులే నిర్ణయం తీసుకుంటున్నారు. తనకు కావాల్సిన వరుడుకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉండాలి.? ఏం చదవి ఉండాలి..? ఎంత సంపాదించాలి..? ఇల్లు..? కారు ఉన్నాయా..? రకరకాల కోరికలతో అమ్మాయిలు ఉంటున్నారు. ముంబైకి (Mumbai) చెందిన ఓ యువతి (Girl) తనకు కావాల్సిన వరుడికి సంబంధించిన క్వాలిటీస్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఏం కావాలంటే.?
సదరు యువతి మరాఠీలో పెట్టిన పోస్ట్‌ను ఓ యూజర్ ట్రాన్స్‌లేట్ చేసి షేర్ చేశారు. ‘ఆ యువతి ముంబైలో ఓ కంపెనీలో పనిచేస్తుంది. ఏడాదికి రూ.4 లక్షల జీతం సంపాదిస్తుంది. ముంబైలో సొంత ఇల్లు, స్థిరమైన ఉద్యోగం లేదంటే బిజినెస్ చేసే వరుడు కావాలి. చదువుకున్న కుటుంబం అయితే బెటర్ అని అభిప్రాయ పడింది. మెడికల్ ఫీల్డ్‌కు చెందిన సర్జన్ కావాలని ప్రిఫర్ చేసింది. సీఏ అయినా ఫర్లేదని ఆ యువతి కోరుకుంది. తనకు కాబోయే భర్త ఏడాది రూ.కోటి సంపాదించాలి అని’ ఆశపడింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్స్ కామెంట్స్
ఇన్ కం టాక్స్ సమాచారం మేరకు దేశంలో 1.7 శాతం మాత్రమే ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్నారు. ఆ యువతికి కావాల్సిన వరుడు దొరికే అవకాశం 0.01 శాతం మాత్రమే ఉందని నెటిజన్ స్పందించారు. ఆ యువతి ఆశ పడటంలో తప్పేం లేదని మరొకరు అభిప్రాయ పడ్డారు. తమ భాగస్వామిని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి హక్కు. తన హక్కును ఆ యువతి ప్రకటించింది. ఆ యువతి ప్రతిపాదనను తిరస్కరించడం హక్కు యువకులకు ఉంటుందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. పిటిషన్ విచారణపై కోర్టు ఏమందంటే..
Vijender Singh: బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్