Mumbai-Amritsar Express: ముంబై-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ABN , Publish Date - Nov 12 , 2024 | 08:23 PM
ఇంజన్ నుంచి రెండో బోగీలో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టు తెలిసింది. దీంతో 45 నిమిషాల పాటు బరూచ్ సిల్వర్ బ్రిడ్జి సమీపంలో రైలును ఆపేశారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
న్యూఢిల్లీ: ముంబై-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారంనాడు మంటల్లో చిక్కుకున్న షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భరూచ్-అంకలేశ్వర్ మధ్య ఒక బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్టూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం.
Jharkhand Elections: జార్ఖాండ్ ఎలక్షన్ డే.. తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
కాగా, ఇంజన్ నుంచి రెండో బోగీలో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టు తెలిసింది. దీంతో 45 నిమిషాల పాటు బరూచ్ సిల్వర్ బ్రిడ్జి సమీపంలో రైలును ఆపేశారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైలులో ఉన్న ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ద్వారా మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అనంతరం రైలు తిరిగి బరూచ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ ఘటనకు కారణాలపై రైల్వే సీనియర్ అధికారులు, రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: కాంగ్రెస్ ఎప్పటికీ ఆ తరగతులను ఎదగనీయదు
Jharkhand: భూములను ఆక్రమిస్తున్న వక్ఫ్ బోర్డుకు ముకుతాడు: అమిత్‌షా
For National news And Telugu Newsఇవి కూడా చదవండి..