Share News

Amit shah: నేను తప్పుకున్నా ఆయన అక్కడే మరో 15 ఏళ్లుంటారు.. ఖర్గేపై షా విసుర్లు

ABN , Publish Date - Dec 18 , 2024 | 08:10 PM

అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేయగా, ఆయన డిమాండ్‌కు అమిత్‌షా బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు.

Amit shah: నేను తప్పుకున్నా ఆయన అక్కడే మరో 15 ఏళ్లుంటారు.. ఖర్గేపై షా విసుర్లు

న్యూఢిల్లీ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అమిత్‌షా మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేయగా, ఆయన డిమాండ్‌కు అమిత్‌షా బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు.

Amit Shah: నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది: అమిత్‌షా


''నేను రాజీనామా చేసినంత మాత్రన కాంగ్రెస్ సమస్య పరిష్కారం కాదు. ఖర్గే నా రాజీనామాను కోరుతున్నారు. ఆ పనిచేస్తే ఆయనకు సంతోషం కలుగుతుంటే నేను రాజీనామా చేస్తాను. కానీ ఆయన సమస్య మాత్రం పరిష్కారం కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూర్చున్న చోటే (విపక్షంలో) మరో 15 ఏళ్లు ఉండాలి'' అని అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్ తన మాటలను వక్రీకరించిందని, రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి కాంగ్రెస్ వ్యతిరేకమని అన్నారు. రాజ్యసభలో తన ప్రసంగం రికార్డుల్లో ఉందని, రాజ్యసభలో తన ప్రసంగాన్ని ప్రజలకు మీడియా చూపించాలని కోరారు.


ఖర్గే ఏమన్నారు?

దీనికిముందు, మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, అమిత్‌షా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాడ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌‌పై ప్రధానమంత్రి మోదీకి గౌరవం ఉంటే ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆ పని చేసినప్పుడే ప్రజలు సైలెంట్‌గా ఉంటారని అన్నారు. లేదంటే ప్రజలు నిరనసలకు దిగుతారని, బాబాసాహెబ్ కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు.


ఇవి కూడా చదవండి..

Jammu and Kashmir: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు

Rahul Gandhi:ఆల్‌టైం హైకి వాణిజ్య లోటు.. కేంద్రంపై రాహుల్ ఫైర్

For National News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 08:14 PM