Share News

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:31 AM

ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈరోజు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటి, దీని చరిత్ర ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..
National Farmers Day

వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక లాంటిది. మన దేశ జనాభాలో దాదాపు 58% మందికి ఉపాధిని కల్పిస్తోంది కూడా వ్యవసాయమే. దీంతోపాటు దేశ GDPకి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాంటి రైతు లేదా కిసాన్ దినోత్సవాన్ని (National Farmers Day) ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు స్పెషల్ ఏంటి, చరిత్ర ఏంటనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివస్ 2024) ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటున్నాం. రైతుల సంక్షేమం కోసం తన జీవితమంతా అంకితం చేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిగా ఈ రోజును నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ప్రధాన లక్ష్యం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి రైతుల సహకారాన్ని గుర్తించడం. వారి సంక్షేమం కోసం అవగాహన కల్పించడం. సుస్థిర వ్యవసాయం కోసం రైతులను శక్తివంతం చేయడమే ఈ ఏడాది రైతు దినోత్సవ ఇతివృత్తం.


చౌదరి చరణ్ సింగ్ ఎవరు

భారతరత్న చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో 1902లో జన్మించారు. రైతు కుటుంబంలో జన్మించిన చరణ్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన రైతుల సమస్యల కోసం నిరంతరం పనిచేశారు. ఆయన చర్యలు, విధానాల ఫలితంగా రైతుల దూతగా నిలిచారు. ఆ క్రమంలో 1967లో తొలిసారిగా చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతకు ముందు మంత్రిగా ఉంటూ ఎన్నో శాఖలు నిర్వహించారు. 1970లో చరణ్ సింగ్ మరోసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.


ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు..

దీంతోపాటు చరణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం తక్కువే అయినప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఎన్నో ముఖ్యమైన పథకాలు రూపొందించారు. వ్యవసాయ రంగంలో సుస్థిరతను తీసుకురావడానికి, రైతుల సమస్యలను తొలగించడానికి అనేక విధానాలు ఏర్పాటు చేశారు. దీంతో 2001లో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గౌరవార్థం భారత ప్రభుత్వం డిసెంబర్ 23ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.


చౌదరి చరణ్ సింగ్ సహకారం

చౌదరి చరణ్ సింగ్ రైతుల హక్కులను కాపాడేందుకు ఎప్పుడూ పోరాడేవారు. 1978లో ఆయన కిసాన్ ట్రస్ట్‌ను స్థాపించారు. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ సమాజానికి న్యాయం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. ఆయన ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలు రైతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా భారతీయ వ్యవసాయ రంగంలో స్థిరత్వం, పురోగతికి మార్గం సుగమం చేశాయి.


జాతీయ రైతు దినోత్సవం ప్రాముఖ్యత

జాతీయ రైతు దినోత్సవం ఉద్దేశం భారతీయ రైతుల సహకారాన్ని గుర్తించడం, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేయడం. ఈ రోజున దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇందులో రైతులకు కొత్త సాంకేతికతలు, పథకాల గురించి సమాచారం తెలియజేయడం. ఈ రోజు రైతులు తమ సవాళ్లు, లక్ష్యాలను చర్చించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే రైతుల పోరాటాలను అర్థం చేసుకోవడానికి, వాటి పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వారి ఉత్పాదకతను పెంచడంలో రైతులకు సహాయం అందించడం కూడా ఈ రోజు ప్రధాన లక్ష్యం.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..

Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..


Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 23 , 2024 | 11:41 AM