NMC: టెస్టుల తర్వాతే యాంటీ బయాటిక్‌లు!
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:17 AM
పేషంట్లు ఆరోగ్య పరీక్షలు (డయాగ్నస్టిక్ టెస్ట్‌లు) చేయించుకున్న తర్వాత ఆ రిపోర్టుల ఆధారంగా, అవసరమైతేనే యాంటీబయాటిక్ ఔషధాలను సిఫార్సు చేయాలని .......
వైద్య సంస్థలకు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, జూన్ 19: పేషంట్లు ఆరోగ్య పరీక్షలు (డయాగ్నస్టిక్ టెస్ట్‌లు) చేయించుకున్న తర్వాత ఆ రిపోర్టుల ఆధారంగా, అవసరమైతేనే యాంటీబయాటిక్ ఔషధాలను సిఫార్సు చేయాలని వైద్యులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సూచించింది. ఆరోగ్య పరీక్షలు జరగక ముందు యాంటీబయాటిక్‌లను సిఫార్సు చేయరాదని స్పష్టం చేసింది. దేశంలో యాంటీబయాటిక్ ఔషధాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయి యాంటీ మైక్రోబియల్ నిరోధకతకు దారితీయటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యాధికారక సూక్ష్మజీవులు ఔషధాలకు లొంగని విధంగా తయారుకావటాన్ని యాంటీ మైక్రోబియల్ నిరోధకతగా పేర్కొంటారు. కాగా, ఈ ఏడాది జనవరిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్.. యాంటీబయాటిక్ ఔషధాలను సిఫార్సు చేసిన ప్రతిసారీ అందుకు కారణాలను ప్రిస్ర్కిప్షన్‌పై స్పష్టంగా రాయాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది.