Share News

Navjot Singh Sidhu: నవజోత్‌ సిద్దు భార్యకు రూ.850 కోట్లకు నోటీసులు

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:42 AM

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దు, ఆయన భార్య నవజోత్‌ కౌర్‌ సిద్దు చిక్కుల్లో పడ్డారు.

Navjot Singh Sidhu: నవజోత్‌ సిద్దు భార్యకు రూ.850 కోట్లకు నోటీసులు

న్యూఢిల్లీ, నవంబరు 29: మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దు, ఆయన భార్య నవజోత్‌ కౌర్‌ సిద్దు చిక్కుల్లో పడ్డారు. అల్లోపతి మందులతో పనిలేకుండా కేవలం ఆహార నియంత్రణతోనే తన భార్యకు స్టేజ్‌-4 కేన్సర్‌ నయమైందంటూ సిద్దు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛత్తీ్‌సగఢ్‌ సివిల్‌ సొసైటీ (సీసీఎస్‌) కౌర్‌కు రూ.850 కోట్లకు నోటీసులు పంపించింది.


కేన్సర్‌ చికిత్సకు సంబంధించి వారం రోజుల్లోగా ఆధారాలు చూపించాలని, లేదంటే రూ.850 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో హెచ్చరించింది. దీనిపై సీసీఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కుల్దీప్‌ సోలంకి మాట్లాడుతూ.. ‘ఇలాంటి మాటలు విని కేన్సర్‌ రోగులు అల్లోపతి చికిత్స తీసుకోవడం, మందులు వేసుకోవడం మానేస్తే వారి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 05:42 AM