Haryana New CM: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ
ABN , Publish Date - Mar 12 , 2024 | 02:18 PM
హర్యానాలో బీజేపీ సీనియర్ నేత, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సీఎం పేరును కూడా పార్టీ ప్రకటించింది.
హర్యానా(Haryana Politics)లో బీజేపీ సీనియర్ నేత, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే కొత్త సీఎంకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా పార్టీ నుంచి వెలువడింది. హర్యానా కొత్త సీఎంగా(Haryana new cm) నయాబ్ సింగ్ సైనీని(Nayab Singh Saini) ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సైనీ సాయంత్రం 5 గంటలకు హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుతం హర్యానా బీజేపీ అధ్యక్షుడు, కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. సైనీ జనవరి 25, 1970న అంబాలాలోని చిన్న గ్రామమైన మిజాపూర్ మజ్రాలో కుటుంబంలో జన్మించారు. ఆయన ముజఫర్‌పూర్‌లో బి.ఆర్. అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలు పొందారు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో కూడా గతంలో చేరారు. ఆ తర్వాత అతను మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలుసుకుని, అతనిచే ప్రభావితమయ్యారు. ఆ తర్వాత అతను బీజేపీలో చేరి అంబాలా కంటోన్మెంట్‌లో అధ్యక్షుడితో సహా పార్టీలో అనేక పదవుల్లో పనిచేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Narendra Modi: దేశంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మొత్తం ఎన్నంటే
నయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini)కి 1996 నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. 2002లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా, అంబాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2005లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సైనీ 2010లో నారాయణ్ గఢ్ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ క్రమంలోనే 2015లో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో కురుక్షేత్ర స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్‌పై 3.85 లక్షల ఓట్లతో విజయం సాధించారు. మనోహర్ లాల్ ఖట్టర్‌కు సైనీ అత్యంత సన్నిహితుడు.