Share News

NBEMS : ఆగస్టు 11న నీట్‌-పీజీ పరీక్ష

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:45 AM

వాయిదా పడ్డ నీట్‌-పీజీ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్టు ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎ్‌స)’ శుక్రవారం ప్రకటించింది.

NBEMS : ఆగస్టు 11న నీట్‌-పీజీ పరీక్ష

న్యూఢిల్లీ, జూలై 5: వాయిదా పడ్డ నీట్‌-పీజీ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్టు ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎ్‌స)’ శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తామని పేర్కొంటూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే.. 2024 ఆగస్టు 15లోపు తమ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకునేవారంతా ఈ పరీక్ష రాయడానికి అర్హులేనని అందులో పేర్కొంది. నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో.. జూన్‌ 23న జరగాల్సిన నీట్‌-పీజీ పరీక్షను ముందుజాగ్రత్త చర్యగా వాయిదా వేస్తున్నట్టు కేంద్రం జూన్‌ 22న ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యవిద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించే ఈ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 2లక్షల మంది పోటీపడుతున్నారు.

Updated Date - Jul 06 , 2024 | 04:45 AM