Share News

New Delhi: డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. 95 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత

ABN , Publish Date - Oct 29 , 2024 | 04:14 PM

ప్రాథమిక సమాచారం ప్రకారం, రెయిడ్స్ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఢిల్లీకి చెంది ఒక వ్యాపారి తీహార్ జైల్ వార్డెన్‌తో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అనధికారికంగా గత కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు గుర్తించారు.

New Delhi: డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. 95 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత

న్యూఢిల్లీ: రహస్యంగా డ్రగ్స్ (Drugs) తయారు చేస్తు్న్న ముఠా గుట్టురట్టయింది. నార్కోటిస్క్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు గౌతమ్‌బుధ్ నగర్ జిల్లా కాసన ఇండస్ట్రియల్ ఏరియాలో మంగళవారం దాడులు జరిపి మెథాంఫెటమైన్ డ్రగ్‌ ను రహస్యంగా తయారు చేస్తున్న ల్యాబ్‌‌ను గుర్తించారు. 95 కిలోల మెథాంపెటమైన్ డ్రగ్‌ను ఘన, ద్రవరూపంలో పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను ఎన్‌సీబీ అరెస్టు చేసినట్టు డీడీజీ (ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు.

Salman Khan: సల్మాన్‌కు బెదరింపులు, నొయిడా యువకుడి అరెస్టు


ప్రాథమిక సమాచారం ప్రకారం, రెయిడ్స్ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఢిల్లీకి చెంది ఒక వ్యాపారి తీహార్ జైల్ వార్డెన్‌తో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అనధికారికంగా గత కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు గుర్తించారు. గతంలో డ్రగ్స్ సరఫరా కేసులో ఢిల్లీ వ్యాపారి అరెస్టయ్యాడని, తీహార్ జైలులో అతను ఉన్నప్పుడు జైలు వార్డెన్‌తో కలిసి ఒప్పందం చేసుకుని డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను రహస్యంగా ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ముంబైకి చెందిన కెమికల్ ఇంజినీరుతో కలిసి ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశీయంగానే కాకుండానే, అంతర్జాతీయంగా కూడా డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు.


మెథాంఫెటమైన్ డ్రగ్‌ తయారీకి అవసరమైన కెమికల్స్‌ను వివిధ మార్గాల ద్వారా ల్యాబ్ సేకరించి, మెషనరీని దిగుమతి చేసుకున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. కాగా, పట్టుబడిన 95 కిలోల డ్రగ్స్ విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 29 , 2024 | 04:17 PM