NDA Govt: ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు
ABN , Publish Date - Jun 15 , 2024 | 11:11 AM
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, అది ఎప్పుడైనా..
కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) మరోసారి ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) పొరపాటున ఏర్పడిందని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని కుండబద్దలు కొట్టారు. అదొక మైనారిటీ ప్రభుత్వమని, సరైన మెజారీ లేదు కాబట్టి ఏ సమయంలోనైనా పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: బస్సుపై ఉగ్రదాడి.. అందరినీ చంపేయాలన్న కసి వారిలో..
‘‘ఎన్‌డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది. మోదీకి మెజారిటీ లేదు. ఇదో మైనారిటీ ప్రభుత్వం. కాబట్టి.. ఎప్పుడైనా కూలిపోవచ్చు. అయితే.. ఈ ప్రభుత్వం కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అది దేశానికే మంచిది. మనమందరం కలిసి దేశ నిర్మాణానికి కృషి చేయాలి. కానీ.. బాగా జరుగుతున్న పనుల్ని కొనసాగనివ్వకపోవడం మన ప్రధాని మోదీకి (PM Modi) అలవాటు. ఏదేమైనా.. దేశాన్ని బలోపేతం చేయడానికి మేము అన్ని విధాలుగా సహకారం అందిస్తాం’’ అని మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు.
Read Also: తక్షణమే యుద్ధం ఆపేందుకు సిద్ధమేనన్న పుతిన్.. కానీ!
ఇందుకు ఎన్డీఏ కూటమిలోని జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల పనితీరును గుర్తు చేస్తూ.. ఖర్గేపై ఎదురుదాడి చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ ఇప్పుడు ‘‘99 చట్రం’’లో చిక్కుకుందని, ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియదా? అని ప్రశ్నించారు. అయితే.. ఖర్గే చెప్పింది నిజమేనని కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీ మద్దతు తెలిపింది. ఈసారి ఓటర్లు మోదీని అంగీకరించలేదని కౌంటర్ ఇచ్చింది.
Read Also: అందరికీ 10.. ఆజంకి మాత్రం 20
ఇదిలావుండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన మెజారిటీ మార్కుకు 32 సీట్ల దూరంలో ఉండిపోవడంతో.. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల సహకారంతో ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు.. కాంగ్రెస్‌కి మాత్రం 99 సీట్లే వచ్చాయి. ఇండియా కూటమి మొత్తంగా చూసుకుంటే 232 సీట్లను కైవసం చేసుకుంది.
Read Latest National News and Telugu News