Share News

NTA : నీట్‌-యూజీ ఇక ఆన్‌లైన్‌లో.. కేంద్రం పరిశీలన

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:03 AM

నీట్‌-యూజీని పెన్ను-పేపరు విధానానికి బదులు ఇక ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

NTA : నీట్‌-యూజీ ఇక ఆన్‌లైన్‌లో.. కేంద్రం పరిశీలన

న్యూఢిల్లీ, జూన్‌ 30: నీట్‌-యూజీని పెన్ను-పేపరు విధానానికి బదులు ఇక ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మే 5న ఈ పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నపత్రం లీక్‌, అవకతవకలు వెలుగుచూడడంతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహణకు కేంద్రం మొగ్గు చూపుతోంది. ఇదిలా ఉండగా, నీట్‌ అక్రమాలకు సంబంధించి గోద్రాలో ఓ పాఠశాల యజమానిని సీబీఐ అరెస్టు చేసింది.

Updated Date - Jul 01 , 2024 | 04:03 AM