Share News

NEET UG 2024: నీట్ పరీక్ష రద్దు సరికాదు.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:23 PM

నీట్ యూజీ 2024 పరీక్షను(NEET UG 2024) పూర్తిగా రద్దు చేయడం వల్ల పరీక్ష రాసిన లక్షలాది మంది నిజాయతీపరులకు అన్యాయం జరుగుతుందని.. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై(NEET Paper Leakage) సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పింది.

NEET UG 2024: నీట్ పరీక్ష రద్దు సరికాదు.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్

ఢిల్లీ: నీట్ యూజీ 2024 పరీక్షను(NEET UG 2024) పూర్తిగా రద్దు చేయడం వల్ల పరీక్ష రాసిన లక్షలాది మంది నిజాయతీపరులకు అన్యాయం జరుగుతుందని.. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై(NEET Paper Leakage) సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పింది.

భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాలు లేవని అలాంటప్పుడు మొత్తం పరీక్షను రద్దు చేయడం సబబు కాదని కోర్టుకు వివరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పారదర్శక విధానంలోపోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినట్లు కోర్టుకు తెలిపింది.


నీట్ రీషెడ్యూల్ విడుదల..

మే 5న నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష లీకేజీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఫలితాల్లో 60 మందికిపైగా ఫస్ట్ ర్యాంక్ రావడంతోఈ ఆరోపణలు బలపడ్డాయి. దీంతో చాలా మంది పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ వివాదంపై సుప్రీం కోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జులై 8న ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.


అయితే పేపర్ లీక్ అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలను శుక్రవారం ప్రకటించారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ షెడ్యూల్ విడుదల చేశారు. ఆగస్టు 11 న నీట్ పీజీ నిర్వహిస్తారు. ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) గత ఏడు సంవత్సరాలుగా NEET-PG పరీక్షను జరుపుతోంది. నీట్ పరీక్ష పత్రం లీకేజ్ కారణంగా జూన్ 23న నీట్ పీజీ పరీక్షను రద్దు చేశారు. రద్దైన రెండు వారాల తరువాత కొత్త షెడ్యూల్‌ని ప్రకటించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 05 , 2024 | 05:23 PM