Share News

నెట్‌ ప్రశ్నపత్రం లీక్‌ చేసిన చానెళ్లను నిషేధించాం: టెలిగ్రాం

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:29 AM

యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీలో భాగస్వాములైన చానెళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు టెలిగ్రాం సంస్థ తెలిపింది. ‘‘పరీక్ష ప్రశ్నపత్రాలను సర్క్యులేట్‌ చేసిన అన్ని చానెళ్లను నిషేధించాం

నెట్‌ ప్రశ్నపత్రం లీక్‌ చేసిన చానెళ్లను నిషేధించాం: టెలిగ్రాం

న్యూఢిల్లీ, జూన్‌ 21: యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీలో భాగస్వాములైన చానెళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు టెలిగ్రాం సంస్థ తెలిపింది. ‘‘పరీక్ష ప్రశ్నపత్రాలను సర్క్యులేట్‌ చేసిన అన్ని చానెళ్లను నిషేధించాం. పేపర్‌ లీకేజీపై ప్రభుత్వ సంస్థల విచారణకు పూర్తిగా సహకరిస్తాం. చట్టాలకు అనుగుణంగా పనిచేస్తాం’’ అని టెలిగ్రాం సంస్థ ప్రతినిధి శుక్రవారం తెలియజేశారు. చట్టబద్ధమైన ప్రభుత్వ సమాచారం సర్క్యులేషన్‌కు సంబంధించి తమ హెల్ప్‌డె్‌స్కకు ఎప్పుడు ఫిర్యాదు అందినా న్యాయపరమైన తనిఖీలు చేసి, ఐటీ చట్టం 2000 ప్రకారం దాన్ని తొలగిస్తామని వెల్లడించారు. యూజీసీ-నెట్‌ను ఈ నెల 18న దేశవ్యాప్తంగా రెండు విడతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే నెట్‌ ప్రశ్నపత్రాలు డార్క్‌నెట్‌లో అందుబాటులోకి వచ్చాయని, వాటిని టెలిగ్రాంలో సర్క్యులేట్‌ చేశారని పరీక్ష జరిగిన మరుసటి రోజే యూజీసీకి ఫిర్యాదు అందాయి. దీంతో పరీక్షను రద్దు చేశారు.

Updated Date - Jun 22 , 2024 | 06:49 AM