Share News

New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

ABN , Publish Date - Sep 18 , 2024 | 01:25 PM

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు.

New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ (XEC) రూపంలో ఇప్పటికే యూరప్‌లో విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు. అనంతరం ఈ వేరియంట్ యూకే, యూఎస్, డెన్మార్క్‌తోపాటు ఇతర దేశాలకు సైతం విస్తరించిందని పేర్కొన్నారు.

RG Kar case: సీఎం మమత అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే..


ఇది రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నుంచి ఎక్స్ఈసీ హైబ్రిడ్ రకంగా అవిర్భవించిందని వివరించారు. శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. తద్వారా ఆసుపత్రిలో చేరడం కానీ, అనారోగ్యం బారిన పడడం కాని ఉండదని చెప్పారు.

Also Read: PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్


ఇప్పటికే 27 దేశాల నుంచి 500 శాంపిల్స్ సేకరించగా.. ఆ నమూనాల్లో ఎక్స్ఈసీ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించారు. డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లలో ఈ ఎక్స్ఈసీ బలంగా పెరుగుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి


జర్వం, గోంతు మంట, దగ్గు, వాసన తెలియక పోవడం, ఆకలి లేకపోవడం, ఒంటి నొప్పులు ద్వారా కొత్త రకం కోవిడ్ ఎక్స్ఈసీ లక్షణాలను గుర్తించ వచ్చన్నారు. పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన (సీడీసీ) ఈ సందర్బంగా సూచించింది.

For More National News and Telugu News

Updated Date - Sep 18 , 2024 | 03:10 PM